కర్ణాటకలో తగ్గుతున్న కరోనా మృతుల సంఖ్య

ABN , First Publish Date - 2021-07-24T15:01:29+05:30 IST

రాష్ట్రంలో కరోనా బారినపడేవారు రోజూ 1500కు అటుఇటుగా కొనసాగుతున్నా ఇటీవల కొన్నిరోజులుగా మృతుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. శుక్రవారం 30 జిల్లాల్లో 30 మంది మృతి చెందారు. 12 జిల్లాల్లో ఒకరు

కర్ణాటకలో తగ్గుతున్న కరోనా మృతుల సంఖ్య

బెంగళూరు: రాష్ట్రంలో కరోనా బారినపడేవారు రోజూ 1500కు అటుఇటుగా కొనసాగుతున్నా ఇటీవల కొన్నిరోజులుగా మృతుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. శుక్రవారం 30 జిల్లాల్లో 30 మంది మృతి చెందారు. 12 జిల్లాల్లో ఒకరు కూడా మృతి చెందలేదు. మరో 12 జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 1705 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 400, దక్షిణకన్నడ 295, మైసూరు 157, ఉడుపి 131, బెళగావి 90, హాసన్‌ 83మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మిగిలిన జిల్లాల్లో 80మందిలోపు నమోదయ్యారు. 2,243మంది తాజాగా డిశ్చార్జ్‌ అయ్యారు. 24,127మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 8,364 మంది ఉన్నారు. 

Updated Date - 2021-07-24T15:01:29+05:30 IST