రాజ్‌పథ్‌లో బెల్జియన్ జాగిలాలతో ఐటీబీపీ తనిఖీలు

ABN , First Publish Date - 2021-01-20T20:43:39+05:30 IST

ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్సు కమెండోలు బెల్జియన్ మాలినోయిస్ జాగిలాలతో రాజ్ పథ్ ప్రాంతంలో అణువణువు తనిఖీల...

రాజ్‌పథ్‌లో బెల్జియన్ జాగిలాలతో ఐటీబీపీ తనిఖీలు

న్యూఢిల్లీ : జనవరి 26వతేదీ రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్‌పథ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్సు కమెండోలు బెల్జియన్ మాలినోయిస్ జాగిలాలతో రాజ్ పథ్ ప్రాంతంలో అణువణువు తనిఖీలు జరిపారు. బెల్జియం జాగిలాలు ప్రజలతో స్నేహ పూర్వకంగా ఉంటాయి. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలనే విషయంలో ఈ జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రాజ్ పథ్, ఇండియా గేట్ల వద్ద ఐటీబీపీ జవాన్లు బెల్జియం జాగిలాలతో శోధించారు. మందుగుండు సామాగ్రిని ఈ బెల్జియం జాగిలాలు పసిగడతాయి. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ బెల్జియం జాగిలాలు మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను సులభంగా గుర్తిస్తాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ఐటీబీపీ జవాన్లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-01-20T20:43:39+05:30 IST