చైనా నుంచి 60 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కొనుగోలు చేస్తున్న భారత కంపెనీలు

ABN , First Publish Date - 2021-05-08T23:30:39+05:30 IST

భారత్‌లో మెడికల్ ఆక్సిజన్‌కు విపరీతమైన కొరత ఏర్పడిన నేపథ్యంలో పలు కంపెనీలు చైనా నుంచి 60 వేలకు

చైనా నుంచి 60 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కొనుగోలు చేస్తున్న భారత కంపెనీలు

న్యూఢిల్లీ: భారత్‌లో మెడికల్ ఆక్సిజన్‌కు విపరీతమైన కొరత ఏర్పడిన నేపథ్యంలో పలు కంపెనీలు చైనా నుంచి 60 వేలకు పైగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కొనుగోలు చేస్తున్నాయి. ఈ మేరకు చైనా మెడికల్ ఇండస్ట్రీ అసోసియేషన్ తెలిపింది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రీడియంట్స్ (ఏపీఐలు), రెమ్‌డెసివిర్, ఫావిపిరావిర్, డెక్సామెథాసోన్ వంటి కొవిడ్ చికిత్సలో వాడే ఔషధాల కోసం పలు ఇండియన్ కంపెనీలు చైనా చాంబర్ ఆఫ్ కామర్స్ ఫర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ హెల్త్ ప్రొడక్ట్స్ (సీసీసీఎంహెచ్‌పీఐపీ)లను సంప్రదించాయి.  


ఈ నెల 5 నాటికి చైనా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ తయారీదారులు 60వేలకు పైగా ఆర్డర్లను అందుకున్నట్టు చాంబర్ తెలిపింది. వీటిలో చాలా వరకు కన్సైన్‌మెంట్స్‌ను ఈ నెలాఖరు నాటికి డెలివరీ చేస్తామని పేర్కొంది. ఇండియాలోని తమ భాగస్వాములతో నిరంతరం టచ్‌లోనే ఉన్నామని తెలిపింది. అలాగే, పల్స్ ఆక్సీమీటర్లు, యాంటీ ఎపిడెమిక్ డ్రగ్స్, ఏపీఐలు, ఫావివిరావ్, డెక్సామెథాసోన్, రెమ్‌డెసివిర్ వంటి వాటి కోసం అభ్యర్థనలు వస్తున్నట్టు పేర్కొంది. వీటితోపాటు నిట్రైల్ గ్లోవ్స్, సీటీ స్కాన్ పరికరాల కోసం అడుగుతున్నారని, డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచుతున్నట్టు చాంబర్ వివరించింది. 

Updated Date - 2021-05-08T23:30:39+05:30 IST