6 కోట్లకు పైగా టీకా డోసులను 76 దేశాలకు పంపించాం: కేంద్రం

ABN , First Publish Date - 2021-03-22T02:47:00+05:30 IST

ఇప్పటివరకూ 76 దేశాలకు 6 కోట్లకు పైగా టీకా డోసులను ప్రభుత్వం పంపించిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్థన్ నేడు తెలిపారు.

6 కోట్లకు పైగా టీకా డోసులను 76 దేశాలకు పంపించాం: కేంద్రం

న్యూఢిల్లీ: ఇప్పటివరకూ 76 దేశాలకు 6 కోట్లకు పైగా టీకా డోసులను ప్రభుత్వం పంపించిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్థన్ నేడు తెలిపారు. అంతేకాకుండా.. దాదాపు 4.5 కోట్ల మంది భారతీయులు టీకా పొందారని కూడా ఆయన పేర్కొన్నారు. ‘మన ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా టీకా కార్యక్రమాన్ని ఉద్యమస్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు’ అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. సంక్షోభం మిగిల్చిన అనుభవంతో భవిష్యత్తు ఉత్పతాలకు తగిన విధంగా సిద్ధం అయ్యేందుకు వీలుగా సాంకేతికతను అభివృద్ధి చేయాలని కూడా ఆయన శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-03-22T02:47:00+05:30 IST