అన్ని తరగతులకు బడులు ప్రారంభం: ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-10-27T21:58:28+05:30 IST

ఢిల్లీలో నవంబర్ 1 నుంచి అన్ని తరగతులకు పాఠాలు ప్రారంభం కానున్నాయని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిసోడియా ప్రకటించారు. బుధవారం డీడీఎంఏలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నవంబర్ మొదటి రోజు నుంచే పాఠశాలలు తెరుచుకుంటాయని..

అన్ని తరగతులకు బడులు ప్రారంభం: ప్రభుత్వం

న్యూఢిల్లీ: ఢిల్లీలో నవంబర్ 1 నుంచి అన్ని తరగతులకు పాఠాలు ప్రారంభం కానున్నాయని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిసోడియా ప్రకటించారు. బుధవారం డీడీఎంఏలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నవంబర్ మొదటి రోజు నుంచే పాఠశాలలు తెరుచుకుంటాయని, ఒకవేళ ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించదల్చుకుంటే అది ఆయా విద్యాసంస్థలకే ఆ అవకాశాన్ని వదిలేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఆఫ్‌లైన్‌లో కొనసాగే పాఠశాలల్లో కేవలం 50 శాతం సామర్థ్యంతోనే పాఠశాలలు కొనసాగించాలని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థుల కోసం క్యాబ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయనున్నారట. తల్లిదండ్రుల అనుమతితోనే విద్యార్థులను పాఠశాలలు తరలించాల్సి ఉంటుంది. అంతే కాకుండా పాఠశాల ఉద్యోగులు, క్యాబ్ డ్రైవర్లు తప్పనిసరిగా వ్యాక్సీన్ తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది.

Read more