నల్ల ఉప్పు లాభాలివి...

ABN , First Publish Date - 2021-02-03T21:21:14+05:30 IST

చర్మ సౌందర్యాన్ని పెంచే గుణాలు నల్ల ఉప్పులు బోలెడు. అవేమిటంటే...

నల్ల ఉప్పు లాభాలివి...

ఆంధ్రజ్యోతి(03-02-2021)

చర్మ సౌందర్యాన్ని పెంచే గుణాలు నల్ల ఉప్పులు బోలెడు. అవేమిటంటే...


నల్ల ఉప్పు చర్మాన్ని సూక్ష్మక్రిముల నుంచి, ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.


శిరోజాలకు నల్ల ఉప్పును పట్టిస్తే నల్లగా నిగ నిగలాడుడతాయి. ఆరోగ్యంగా ఉంటాయి.


పాదాల దగ్గరి చర్మం పగుళ్లు ఏర్పడి ఇన్‌ఫెక్షన్‌ బారిన పడ తాయి. దాంతో పాదాలు బాగా నొప్పి పెడుతుంటాయి. అలాంటప్పుడు సగం బకెట్‌ నీళ్లలో కాస్త నల్ల ఉప్పు వేసి, ఆ నీటిలో పాదాలను పదిహేను నిమిషాలు ఉంచాలి. తరువాత పాదాలను బయటకు తీసి సున్నితంగా స్క్రబ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలు సాంత్వన పొందుతాయి.


నల్ల ఉప్పు సహజసిద్ధమైన స్క్రబ్బర్‌. శీతాకాలంలో కొద్దిగా నల్ల ఉప్పును చర్మంపై సున్నితంగా రుద్ది నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌ రావడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు తలెత్తవు.


చుండ్రు సమస్యకు నల్ల ఉప్పు బాగా పనిచేస్తుంది. జుట్టుకు నల్ల ఉప్పు రుద్దుకుని పది నిమిషాలయ్యాక కడుక్కుంటే చుండ్రు తగ్గిపోతుంది.  


Read more