పేజీవేసవిలో చర్మ సంరక్షణ ఇలా..!

ABN , First Publish Date - 2021-04-22T18:24:41+05:30 IST

వేసవిలో చర్మసౌందర్యం కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మం దెబ్బతినకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు ఉపయోగపడతాయి.

పేజీవేసవిలో చర్మ సంరక్షణ ఇలా..!

ఆంధ్రజ్యోతి(21-04-2021)

వేసవిలో చర్మసౌందర్యం కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మం దెబ్బతినకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు ఉపయోగపడతాయి.


ముల్తాని మట్టితో తయారుచేసిన ఫేస్‌ప్యాక్‌లు, నిమ్మ, తులసి వంటివి వేసవి సమస్యలను తగ్గిస్తాయి. ఆరు కప్పుల నీళ్లు తీసుకుని అందులో ఒక కప్పు వెనిగర్‌ కలిపి దాంతో రోజుకొకసారి ముఖం శుభ్రం చేసుకుంటే ఫలితం ఉంటుంది. 

ఒక కప్పు పెరుగులో ఒక చెక్క నిమ్మరసం పిండి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఒకవేళ అవసరమైతే దీనిపై మాయిశ్చరైజర్‌ను ఒక కోట్‌ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మూడు, నాలుగు వారాల్లోనే చర్మం మృదువుగా తయారవుతుంది. 

ఇన్‌ఫెక్షన్‌ ఉన్న చోట వెనిగర్‌ లేక ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ను రాయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి, తగ్గించడానికి ఇది ఉపకరిస్తుంది.

కొబ్బరి నూనె, వెన్న అప్లై చేయడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. ఇది మాయిశ్చరింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పగిలిన కాళ్లకు ముల్లంగి గుజ్జు అద్భుతంగా పనిచేస్తుంది. 

బొప్పాయి, అరటి పండ్లను మెత్తగా చేసి ముఖానికి పట్టిస్తే పిగ్మెంట్స్‌ తగ్గిపోతాయి.

Updated Date - 2021-04-22T18:24:41+05:30 IST