చర్మం నిగారింపు కోసం..!

ABN , First Publish Date - 2021-05-27T18:40:47+05:30 IST

చర్మం మృదువుగా తయారవ్వాలి, నిగారింపు సంతరించుకోవాలి అంటే ఆపిల్‌, అరటిపండులతో తయారుచేసిన ఫేస్‌ప్యాక్‌లను ఉపయోగించాలి. బాదం, గంధంతో తయారుచేసుకునే ఫేస్‌ప్యాక్‌ల వల్ల కూడా ఫలితం ఉంటుంది.

చర్మం నిగారింపు కోసం..!

చర్మం మృదువుగా తయారవ్వాలి, నిగారింపు సంతరించుకోవాలి అంటే ఆపిల్‌, అరటిపండులతో తయారుచేసిన ఫేస్‌ప్యాక్‌లను ఉపయోగించాలి. బాదం, గంధంతో తయారుచేసుకునే ఫేస్‌ప్యాక్‌ల వల్ల కూడా ఫలితం ఉంటుంది.


ఒక ఆపిల్‌ను గుజ్జుగా చేసి అందులో రెండు కప్పుల పాలు, కొద్దిగా పంచదార కలిపి మిశ్రమంలా చేసుకుని ముఖానికి పట్టించాలి. తరువాత నెమ్మదిగా మర్ధన చేసుకోవాలి. పావుగంట తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

అరటిపండును గుజ్జుగా చేసి అందులో ఒక టీస్పూన్‌ తేనె వేసి కలుపుకుని ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. దీనివల్ల చర్మరంధ్రాలన్నీ తెరుచుకుంటాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. 

కొన్ని బాదం పలుకులను పొడి చేసి అందులో  కొద్దిగా ఓట్‌మీల్‌, అరకప్పు తాజా క్రీమ్‌ చేర్చి పేస్టులా చేసుకుని ముఖానికి పట్టించాలి. పావుగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

ఒక టేబుల్‌స్పూన్‌ గంధం పొడిని తీసుకుని అందులో రెండు టీస్పూన్ల రోజ్‌వాటర్‌ కలిపి పేస్టులా చేసుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. పావుగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారంలో ఒకరోజు చేయడం వల్ల చర్మం నిగారింపు సంతరించుకుంటుందిఇ.

మూడు టీస్పూన్ల ఓట్‌మీల్‌ తీసుకుని అందులో ఎగ్‌వైట్‌ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి ఒక టీస్పూన్‌ తేనె, పెరుగు చేర్చి బాగా కలియబెట్టాలి. ఈ పేస్టును కొద్ది సేపు ఫ్రిజ్‌లోపెట్టి తరువాత ముఖానికి ప్యాక్‌ మాదిరిగా అప్లై చేయాలి. పావుగంట తరువాత చల్లని నీటితో కడిగేసుకుంటే ముఖం తాజాగా అవుతుంది. 

Read more