మెదడుకూ ప్రమాదమే!

ABN , First Publish Date - 2021-09-15T17:43:31+05:30 IST

వానాకాలంలో చెవిలో బ్యాక్టీరియా, ఫంగస్‌ ఇన్ఫెక్షన్లతో ఈన్‌టీ వైద్యుల్ని కలవడం మామూలే. అయితే ఎక్కువగా ఇయర్‌ ఫోన్లు, ఎయిర్‌పాడ్స్‌ వాడే వాళ్లు ఇటీవల ఈన్‌టీ వైద్యుల్ని కలుస్తున్నారని ఓ అధ్యయనం పేర్కొంది. కొవిడ్‌ నేపథ్యంలో ఇయర్‌ ఫోన్స్‌

మెదడుకూ ప్రమాదమే!

ఆంధ్రజ్యోతి(15-09-2021)

వానాకాలంలో చెవిలో బ్యాక్టీరియా, ఫంగస్‌ ఇన్ఫెక్షన్లతో ఈన్‌టీ వైద్యుల్ని కలవడం మామూలే. అయితే ఎక్కువగా ఇయర్‌ ఫోన్లు, ఎయిర్‌పాడ్స్‌ వాడే వాళ్లు ఇటీవల ఈన్‌టీ వైద్యుల్ని కలుస్తున్నారని ఓ అధ్యయనం పేర్కొంది. కొవిడ్‌ నేపథ్యంలో ఇయర్‌ ఫోన్స్‌ వాడకం అధికమైన ఈ రోజుల్లో.. వాటితో వచ్చే సమస్యలనూ దృష్టిలో ఉంచుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


పని ప్రదేశాల్లో, ఆన్‌లైన్‌ క్లాసులను వినేందుకు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగాలు చేసేప్పుడు ఇయర్‌ ఫోన్లు విపరీతంగా వాడుతున్నారు. ముఖ్యంగా యువత ఫోన్లు మాట్లాడేందుకు, సంగీతం కోసం వీటికే అంకితమవుతోంది. ఈ ధోరణి మంచిది కాదంటున్నారు నిపుణులు. చిన్న వయసులోనే చెవి నొప్పులతో, ఇన్ఫెక్షన్లతో బాధపడేది యువతే అని వారు అంటున్నారు. ఇయర్‌ ఫోన్లు ఎక్కువ వాడటం వల్ల చెవిలో నొప్పి, వాపు వచ్చే అవకాశాలెక్కువ.


ఉదయం నడక, జిమ్‌, వీధుల్లో నడిచేప్పుడు, బస్సుల్లో, మెట్రోల్లో ప్రయాణించేప్పుడు, ఆఫీసుల్లో... ఇలా రోజంతా ఇయర్‌ఫోన్లతో సావాసం చేసే వాళ్లు ఇతరులను ఇబ్బంది పెట్టకపోవచ్చు కానీ.. ఎవరికి వాళ్లు సమస్యలోకి వెళ్లినట్లే. ఒక బిలియన్‌ జనాలు భవిష్యత్తులో చెవుడు సమస్యతో బాధపడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. 


చక్కటి సౌండ్‌తో వినాలనే ఆలోచనతో పూర్తి సౌండ్‌ను సెట్‌ చేసుకుని సంగీతం వింటుంటారు. చెవికి క్లోజ్‌గా ఇయర్‌ ఫోన్లు అమర్చుకుని ఇలా వినటం వల్ల దీర్ఘకాలికంగా సమస్యలు ఎదుర్కోవాల్సిందే. ముఖ్యంగా ఇలా చేయడం వల్ల క్రిములు రకరకాల ఇన్ఫెక్షన్లను పుట్టిస్తాయి. మంచి సంగీతం విని అనుభూతి చెందినా.. చివరికి చెవుల్లో సెన్సిటివిటీ తగ్గిపోతుంది. కర్ణభేరికి ఇబ్బంది కలుగుతుంది. 


ఇయర్‌ ఫోన్లు వాడే వారిలో దాదాపు 50 శాతం మంది చిన్నపాటి శబ్ధాలనూ వినలేరు. ముఖ్యంగా ఎలక్ర్టోమ్యాగ్నటిక్‌ తరంగాల వల్ల తలనొప్పితో పాటు మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇయర్‌ ఫోన్స్‌ బదులు హెడ్‌ ఫోన్లు వాడితే కాస్త ఉపశమనమే. అయితే సమస్యలు తగ్గుతాయనే గ్యారెంటీ లేదు. ఎలక్ర్టానిక్‌ గ్యాడ్జెట్స్‌ అయిన ఇయర్‌ ఫోన్లను అవసరానికి వాడుకుంటేనే మంచిది. అనవసరంగా వాటితో కాలక్షేపం చేస్తే తర్వాత బాధపడినా ఉపయోగం లేదు.


Read more