బొప్పాయి రసంతో ఇలా చేసి చూడండి!

ABN , First Publish Date - 2021-03-10T17:51:28+05:30 IST

తాజా పండ్లతో జ్యూసు చేసుకుని తాగితే తలనొప్పి నుంచి త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది. బొప్పాయి పండును పేస్టులా చేసి లేదా బొప్పాయి రసాన్ని ముఖానికి రాసుకుంటే నల్ల మచ్చలు పోతాయి.

బొప్పాయి రసంతో ఇలా చేసి చూడండి!

ఆంధ్రజ్యోతి(10-03-2021)

తాజా పండ్లతో జ్యూసు చేసుకుని తాగితే తలనొప్పి నుంచి త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది. 

బొప్పాయి పండును పేస్టులా చేసి లేదా బొప్పాయి రసాన్ని ముఖానికి రాసుకుంటే నల్ల మచ్చలు పోతాయి. 

రోజూ ఒక గ్లాసు చెరకు రసం తాగితే మూత్రాశయ సమస్యలు తగ్గుతాయి. కిడ్నీలో రాళ్లు కరుగుతాయి. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.

మొటిమల సమస్యకు గుడ్డులోని తెల్లసొన బాగా పనిచేస్తుంది. 

మజ్జిగలో ఒక స్పూను మెంతులు వేసి రాత్రంతా నానబెట్టి, ఉదయాన ఆ నీళ్లను పరగడుపున తాగితే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. 

గంధం పొడి, పసుపు, రోజ్‌ వాటర్‌ మిశ్రమాన్ని పేస్టులా చేసుకుని ముఖానికి రాసుకుంటే నల్లబడిన చర్మం మళ్లీ తాజాగా మారుతుంది.

తేనెలో కొంచెం తులసి రసాన్ని కలిపి తాగితే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. 

Read more