మాన్‌సూన్‌ ఫేస్‌ప్యాక్‌లివి!

ABN , First Publish Date - 2021-06-17T18:45:24+05:30 IST

ఒక పాత్రలో మూడు టేబుల్‌స్పూన్ల ఓట్‌మీల్‌, ఒక ఎగ్‌వైట్‌, ఒక టీస్పూన్‌ తేనె, ఒక టీస్పూన్‌ పెరుగు తీసుకుని కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. ప్యాక్‌ అప్లై చేసుకునే ముందు ముఖాన్ని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి

మాన్‌సూన్‌ ఫేస్‌ప్యాక్‌లివి!

ఆంధ్రజ్యోతి(17-06-2021)

వానాకాలంలో చర్మం నిగారింపు తగ్గకుండా ఉండాలంటే తగిన ప్యాక్‌లను ఎంచుకోవాలి. 


ఈ సీజన్‌లో ఎలాంటి ఫేస్‌ప్యాక్‌లను ఉపయోగించాలంటే...

ఒక పాత్రలో మూడు టేబుల్‌స్పూన్ల ఓట్‌మీల్‌, ఒక ఎగ్‌వైట్‌, ఒక టీస్పూన్‌ తేనె, ఒక టీస్పూన్‌ పెరుగు తీసుకుని కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. ప్యాక్‌ అప్లై చేసుకునే ముందు ముఖాన్ని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తరువాత ప్యాక్‌ను అప్లై చేసుకోవాలి. ఆరిన తరువాత నీళ్లతో కడిగేసుకోవాలి. 

స్ట్రాబెర్రీలు నాలుగైదు, బ్రెడ్‌ముక్కలు రెండు టీస్పూన్లు, ముల్తానీమట్టి - కొద్దిగా, రోజ్‌వాటర్‌... వీటన్నింటిని కలిపి పేస్టులా చేసుకోవాలి. ముఖానికి ప్యాక్‌లా వేసుకుని ఇరవై నిమిషాల తరువాత ఫేస్‌వాష్‌ చేసుకోవాలి. 

పుదీనా ఆకులను మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. తరువాత అరటిపండును మెత్తగా చేసి వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

Read more