నలుపుదనం పోవాలంటే!

ABN , First Publish Date - 2021-03-13T16:57:18+05:30 IST

మృతకణాలు పేరుకుపోవడం, ఎక్కువ సమయం ఎండలో ఉండడం వల్ల మోచేతులు, మోకాళ్ల దగ్గరి చర్మం నల్లగా, గరుకుగా మారుతుంది. అందుకే చర్మసంరక్షణలో భాగంగా మోచేతులు, మోకాళ్ల దగ్గరి చర్మం మీద కూడా దృష్టి పెట్టాలి అంటున్నారు సౌందర్యనిపుణురాలు అనితా గొలానీ. ఆమె చెబుతున్న చిట్కాలివి...

నలుపుదనం పోవాలంటే!

ఆంధ్రజ్రోతి(13-03-2021)

మృతకణాలు పేరుకుపోవడం, ఎక్కువ సమయం ఎండలో ఉండడం వల్ల మోచేతులు, మోకాళ్ల దగ్గరి చర్మం నల్లగా, గరుకుగా మారుతుంది. అందుకే చర్మసంరక్షణలో భాగంగా మోచేతులు, మోకాళ్ల దగ్గరి చర్మం మీద కూడా దృష్టి పెట్టాలి అంటున్నారు సౌందర్యనిపుణురాలు అనితా గొలానీ. ఆమె చెబుతున్న చిట్కాలివి...

మోచేతులు, మోకాళ్ల దగ్గరి చర్మం మీద తాజా నిమ్మరసాన్ని మసాజ్‌ చేస్తున్నట్టు రుద్దుకోవాలి. పదినిమిషాలయ్యాక గోరు వెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. కొన్ని వారాలు ఇలా చేస్తే మోచేతులు, మోకాళ్ల దగ్గరి నలుపుదనం తగ్గిపోతుంది. నిమ్మరసంలోని బ్లీచింగ్‌, ఆమ్ల గుణాలు చర్మాన్ని కాంతిమంతంగా మార్చేస్తాయి.  

టీ స్పూన్‌ చొప్పున వెనిగర్‌, శెనగపిండిని పెరుగులో కలపాలి. ఈ పేస్ట్‌ను మోచేతులు, మోకాళ్లకు రాసుకోవాలి. 15నిమిషాల తరువాత వేడినీళ్లతో కడుక్కోవాలి. దాంతో చర్మం మృదువుగా మారుతుంది.  

కొబ్బరి నూనెతో మోచేతులు, మోకాళ్ల దగ్గర మసాజ్‌ చేసుకోవాలి. తరువాత వేడినీటితో షవర్‌ బాత్‌ చేయాలి.  

ఆలివ్‌ నూనెకు చక్కెర కలిపితే చక్కని స్క్రబ్‌లా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని మోచేతులు, మోకాళ్లకు రాసుకుంటే మృతకణాలను తొలగించి చర్మానికి కాంతినిస్తుంది

ఓట్‌మీల్‌, యోగర్ట్‌ మాస్క్‌ చర్మానికి తేమను అందించి స్వాంతనిస్తుంది. ఓట్‌మీల్‌, యోగర్ట్‌ను సమపాళ్లలో తీసుకొని మోచేతులు, మోకాళ్ల దగ్గర రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీళ్లతో  శుభ్రం చేసుకోవాలి.

Read more