కళ్ల కింద నల్లటి వలయాలు పోవాలంటే ఇలా చేయండి!

ABN , First Publish Date - 2021-11-03T18:29:27+05:30 IST

కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు ముఖారవిందాన్ని దెబ్బతీస్తాయి. ఒత్తిడి, నిద్రలేమి... ఇలా రకరకాల కారణాల వల్ల ఇవి ఏర్పడుతుంటాయి. వీటిని దూరం చేసుకోవాలంటే...

కళ్ల కింద నల్లటి వలయాలు పోవాలంటే ఇలా చేయండి!

ఆంధ్రజ్యోతి(03-11-2021)

కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు ముఖారవిందాన్ని దెబ్బతీస్తాయి. ఒత్తిడి, నిద్రలేమి... ఇలా రకరకాల కారణాల వల్ల ఇవి ఏర్పడుతుంటాయి. వీటిని దూరం చేసుకోవాలంటే... 

కొబ్బరి నూనె లేదా ఆల్మండ్‌ ఆయిల్‌తో కళ్ల కింద నెమ్మదిగా చేతి వేళ్లతో రుద్దినట్టుగా మసాజ్‌ చేయాలి. రోజూ ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. 

కొబ్బరి తురుములో కొద్దిగా నిమ్మరసం, కీరదోస గుజ్జు, ఒక టీస్పూన్‌ క్రీమ్‌ వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. తరువాత దూదితో నెమ్మదిగా కళ్ల కింద మాస్క్‌లా అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత పాలతో శుభ్రం చేసుకోవాలి. తరువాత నీళ్లతో కడిగేసుకోవాలి.

టొమాటో జ్యూస్‌లో నిమ్మరసం కలిపి కళ్ల కింద మర్దన చేయాలి. ఇరవై నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. రోజూ ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

బంగాళదుంపను గుజ్జుగా చేసి లేదా ముక్కలుగా కట్‌ చేసి కళ్లపై పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు సులభంగా తగ్గిపోతాయి.

Updated Date - 2021-11-03T18:29:27+05:30 IST