మచ్చలు పోతాయిలా..!

ABN , First Publish Date - 2021-09-16T17:19:22+05:30 IST

మొటిమలు గిల్లడం వల్ల మచ్చలు ఏర్పడతాయి. ఇవి ముఖారవిందాన్ని దెబ్బతీస్తాయి. అయితే ముల్తానీ మట్టి ఫేస్‌ప్యాక్‌ ఉపయోగించడం వల్ల మచ్చలు తొలగించకోవచ్చు. ముల్తానీ మట్టిలో మెగ్నీషియం క్లోరైడ్‌ ఉంటుంది. ఇది మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను తొలగిస్తుంది. పసుపు యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. చర్మం పీహెచ్‌ లెవెల్స్‌ సరైన స్థాయిలో ఉండేలా చూస్తుంది. ఈ ప్యాక్‌ ఎలా తయారుచేసుకోవాలంటే...

మచ్చలు పోతాయిలా..!

ఆంధ్రజ్యోతి(16-09-2021)

మొటిమలు గిల్లడం వల్ల మచ్చలు ఏర్పడతాయి. ఇవి ముఖారవిందాన్ని దెబ్బతీస్తాయి. అయితే ముల్తానీ మట్టి ఫేస్‌ప్యాక్‌ ఉపయోగించడం వల్ల మచ్చలు తొలగించకోవచ్చు. ముల్తానీ మట్టిలో మెగ్నీషియం క్లోరైడ్‌ ఉంటుంది. ఇది మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను తొలగిస్తుంది. పసుపు యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. చర్మం పీహెచ్‌ లెవెల్స్‌ సరైన స్థాయిలో ఉండేలా చూస్తుంది. ఈ ప్యాక్‌ ఎలా తయారుచేసుకోవాలంటే...

ఒక బౌల్‌లో రెండు టీస్పూన్ల ముల్తానీ మట్టి తీసుకుని అందులో అర టీస్పూన్‌ పసుపు, అర టీస్పూన్‌ గంధం, కొద్దిగా నిమ్మరసం వేసి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి పట్టించి బాగా ఆరేంత వరకు ఉంచాలి. తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. వారంలో రెండు రోజులు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ముఖం కాంతిమంతంగా కావాలంటే కుంకుమపువ్వు ఫేస్‌ప్యాక్‌ని ఉపయోగించాలి. కుంకుమపువ్వులో ఐరన్‌, పొటాషియం, క్యాల్షియం, సెలీనియం, జింక్‌, కాపర్‌, విటమిన్‌-ఎ, ఫోలిక్‌యాసిడ్‌, నియాసిన్‌ ఉంటాయి. ఈ ప్యాక్‌తో ముఖారవిందం పెరుగుతుంది. డార్క్‌ సర్కిల్స్‌ దూరమవుతాయి. ఈ ప్యాక్‌ ఎలా చేసుకోవాలంటే...

ఒక బౌల్‌లో రెండు టీస్పూన్ల నీళ్లు వేసి అందులో కుంకుమపువ్వు వేసి రాత్రంతా ఉంచాలి. ఉదయాన ఆ నీళ్లలో  ఒక టీస్పూన్‌ పాలు, కొద్దిగా పంచదార, రెండు మూడు చుక్కల కొబ్బరి నూనె వేసి కలపాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి పట్టించి పావుగంట పాటు వదిలేయాలి. తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండు, మూడు సార్లు ఈ ఫేస్‌ప్యాక్‌ ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Read more