ఎగ్‌వైట్‌తో మెరుపులీనే చర్మం!

ABN , First Publish Date - 2021-02-17T18:06:53+05:30 IST

పోషకాలతో నిండిన గుడ్లు శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు ఒంటిని మెరిపిస్తాయి కూడా. గుడ్డులోని తెల్లసొన ఫేస్‌ప్యాక్‌గా అద్భుతంగా పనిచేస్తుంది. తెల్లసొనలోని లవణాలు, విటమిన్లు, ప్రొటీన్లు ముఖాన్ని కాంతిమంతంగా మారుస్తాయి.

ఎగ్‌వైట్‌తో మెరుపులీనే చర్మం!

ఆంధ్రజ్యోతి(17-02-2021)

పోషకాలతో నిండిన గుడ్లు శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు ఒంటిని మెరిపిస్తాయి కూడా. గుడ్డులోని తెల్లసొన ఫేస్‌ప్యాక్‌గా అద్భుతంగా పనిచేస్తుంది. తెల్లసొనలోని లవణాలు, విటమిన్లు, ప్రొటీన్లు ముఖాన్ని కాంతిమంతంగా మారుస్తాయి. 

ఒక చిన్న గిన్నెలో టేబుల్‌ స్పూన్‌ గుడ్డు తెల్లసొన, రెండు మూడు చుక్కల పట్చౌలి ఎసెన్షియల్‌ ఆయిల్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని ఆరిన తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం మీది గీతలు పోతాయి. చర్మం బిగుతుగా మారుతుంది.

టేబుల్‌ స్పూన్‌ ఎగ్‌వైట్‌లో, అర టీస్పూన్‌ తేనె కలిపిన మిశ్రమాన్ని ఫేస్‌ప్యాక్‌లా రాసుకోవాలి. ఎగ్‌వైట్‌, తేనె చర్మానికి పోషణనిస్తాయి. ఇలా రెండు వారాలు చేస్తే చర్మం మీది ముడతలు మాయమవుతాయి.

స్పూన్‌ ఎగ్‌వైట్‌, టీ స్పూన్‌ చొప్పున చక్కెర, మొక్కజొన్న పిండితో ఫేస్‌ప్యాక్‌ తయారుచేసుకోవాలి. నల్లమచ్చలను పోగొట్టడంలో ఈ ప్యాక్‌ మెరుగ్గా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే మలినాలు, మృతకణాలు తొలగిపోతాయి.

జిడ్డు చర్మం ఉన్నవారు ఎగ్‌వైట్‌కు అర టీస్పూన్‌ నిమ్మరసం, టీస్పూన్‌ తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఈ ప్యాక్‌ ఉపయోగిస్తే జిడ్డు తగ్గి, ముఖం తాజాగా కనిపిస్తుంది. 

Read more