పాలతో నిగారింపు!

ABN , First Publish Date - 2021-06-02T20:56:47+05:30 IST

పాలు ఆరోగ్యప్రదమే కాదు, సౌందర్య సాధనం కూడా. చర్మానికి చక్కటి మాయిశ్చరైజర్‌గా పాలు ఉపయోగపడతాయి. ముఖం మీద ముడతలను నివారిస్తాయి. చర్మం మీద మృత కణాలను తొలగించడానికీ,

పాలతో నిగారింపు!

ఆంధ్రజ్యోతి(02-06-2021)

పాలు ఆరోగ్యప్రదమే కాదు, సౌందర్య సాధనం కూడా. చర్మానికి చక్కటి మాయిశ్చరైజర్‌గా పాలు ఉపయోగపడతాయి. ముఖం మీద ముడతలను నివారిస్తాయి. చర్మం మీద మృత కణాలను తొలగించడానికీ, ఎండ కారణంగా కమిలిన చర్మాన్ని సాధారణ స్థితికి తేవడానికీ, మొటిమలను తగ్గించడానికీ పాలు దోహదపడతాయి. 


గంధం పొడితో: ఒక టేబుల్‌ స్పూన్‌ గంధం పొడి, అర టేబుల్‌ స్పూన్‌ పాలు తీసుకొని, పేస్ట్‌లా చేయండి. దాన్ని ముఖానికి రాసుకొని, 15 నిమిషాలు ఉంచండి. గంధం చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది. పాలలో ఉండే విటమిన్ల ద్వారా పోషకాలు అందుతాయి చర్మం హైడ్రేట్‌ అవుతుంది. 


తేనె, నిమ్మ రసంతో: ఒక టేబుల్‌ స్పూన్‌ పాలు, అర టేబుల్‌ స్పూన్‌ తేనె, నిమ్మరసం కలిపి ముఖానికీ, మెడకూ రాసుకొండి. 10 నిమిషాలు ఉంచితే చాలు. ఇది ప్రకృతి సిద్ధమైన బ్లీచ్‌గా పని చేస్తుంది. ముఖం మీద ముడతలు రాకుండా నివారిస్తుంది.


శనగపిండి, తేనెతో: చిటికెడు శనగపిండి, ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెలో కొంచెం పాలను కలిపి, ఫేస్‌ ప్యాక్‌ వేసుకోండి. 15 నిమిషాల తరువాత కడిగెయ్యండి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చర్మం తళుకులీనుతుంది.


ముల్తానా మట్టితో: ముల్తానా మట్టి ఒక టేబుల్‌ స్పూన్‌, అర టేబుల్‌ స్పూన్‌ పాలు కలిపి చిక్కటి ముద్దలా చేసుకోండి. ముఖంపైనా, మెడపైనా ఈ ప్యాక్‌ను సుమారు 20 నిమిషాల సేపు ఉంచండి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే మృదువైన, మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. 


Read more