అందం మరింత పెరుగు

ABN , First Publish Date - 2021-07-07T17:15:30+05:30 IST

ఆందమే ఆనందం. ముఖారవిందాన్ని పెంచుకోవటానికి మార్కెట్లో ఫేస్‌క్రీమ్స్‌పై ఆధారపడతారు కొందరు. అయితే మీ ఇంట్లోనే మేనిఛాయను మెరుగ్గా చేసుకోవచ్చు. పెరుగుతో చేసే ఫేస్‌ప్యాక్స్‌ కొన్ని తెలుసుకుందాం.

అందం మరింత పెరుగు

ఆంధ్రజ్యోతి(07-07-2021)

ఆందమే ఆనందం. ముఖారవిందాన్ని పెంచుకోవటానికి మార్కెట్లో ఫేస్‌క్రీమ్స్‌పై ఆధారపడతారు కొందరు. అయితే మీ ఇంట్లోనే మేనిఛాయను మెరుగ్గా చేసుకోవచ్చు. పెరుగుతో చేసే ఫేస్‌ప్యాక్స్‌ కొన్ని తెలుసుకుందాం.

బౌల్‌లో సగం కప్పు పెరుగు తీసుకుని అందులోకి రెండు టీ స్పూన్ల శనగపిండి వేయాలి.  రెండు టీ స్పూన్ల టొమాటో రసం వేయాలి. బాగా కలియబెట్టాలి. 

పేస్టును ముఖానికి పట్టించుకోవాలి. ఐదు నిమిషాలయ్యాక మంచి నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. 

బౌల్‌లో సగం కప్పు పెరుగు తీసుకోవాలి. అందులోకి ఆలివ్‌ ఆయిల్‌ వేసి కలియబెట్టాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 25 నిమిషాల తర్వాత కడిగేయాలి. 

సగం కప్పు గట్టి పెరుగును తీసుకోవాలి. దానికి రెండు టేబుల్‌ స్పూన్ల తేనెను యాడ్‌ చేసి బాగా మిక్స్‌ చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకోవాలి. అరగంట తర్వాత కడిగేస్తే ఓ ఫ్రెష్‌ ఫీలింగ్‌ కలుగుతుంది.

Read more