కొబ్బరినూనెతో అందం

ABN , First Publish Date - 2021-06-30T16:19:25+05:30 IST

కొబ్బరినూనె శిరోజ సౌందర్యానికే కాదు, చర్మ సౌందర్యానికీ ఉపయోగపడుతుంది. చర్మ నిగారింపుకు కొబ్బరినూనె మాస్క్‌లను ఇంట్లోనే తయారుచేసుకుని అప్లై చేసుకోవచ్చు.

కొబ్బరినూనెతో అందం

ఆంధ్రజ్యోతి(30-06-2021)

కొబ్బరినూనె శిరోజ సౌందర్యానికే కాదు, చర్మ సౌందర్యానికీ ఉపయోగపడుతుంది. చర్మ నిగారింపుకు కొబ్బరినూనె మాస్క్‌లను ఇంట్లోనే తయారుచేసుకుని అప్లై  చేసుకోవచ్చు.


జిడ్డు చర్మం: అర టేబుల్‌స్పూను కొబ్బరినూనె, అర టేబుల్‌స్పూను నిమ్మరసం, ఒక టేబుల్‌స్పూను పెరుగును ఒక గిన్నెలో కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత కడిగేసుకుంటే జిడ్డు వదలి ముఖం ప్రకాశవంతమవుతుంది.


ముడతలు: ఒక అవకాడో, 4 టేబుల్‌స్పూన్ల కొబ్బరినూనె, రెండు టీస్పూన్ల జాజికాయ పొడి గిన్నెలో కలిపి, ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే గీతలు వదిలి, చర్మం బిగుతుగా తయారవుతుంది.


బ్లాక్‌హెడ్స్‌ : ఒక టేబుల్‌స్పూను కొబ్బరినూనె, ఒక టీస్పూన్‌ బేకింగ్‌ పౌడర్‌లను కలిపి ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే బ్లాక్‌హెడ్స్‌ తొలగిపోతాయి.


ఈ సౌందర్య చికిత్సలు అన్నిటికీ వంటకు ఉపయోగించే గానుగ పట్టి తీసిన తాజా కొబ్బరి నూనెనే వాడాలి.

Read more