వయసు ఛాయలు కనిపించకుండా!

ABN , First Publish Date - 2021-02-18T18:23:23+05:30 IST

కళ్ల కింద నల్లమచ్చలను చింతపండు పోగొడుతుంది. ఇందులోని సిట్రిక్‌ యాసిడ్‌ ఆరోగ్యానికే కాదు చర్మం అందంగా ఉండడానికి కూడా సహాయపడుతుంది. చింతపండు, పాలు రెండింటిని మిక్సీలో వేసి మెత్తటి గుజ్జులా చేయాలి. ఆ పేస్టును ముఖానికి రాసుకుని కాసేపటి తర్వాత చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం మీది నల్ల మచ్చలు, ముడతలు తొలగిపోతాయి.

వయసు ఛాయలు కనిపించకుండా!

ఆంధ్రజ్యోతి(18-02-2021)

కళ్ల కింద నల్లమచ్చలను చింతపండు పోగొడుతుంది. ఇందులోని సిట్రిక్‌ యాసిడ్‌  ఆరోగ్యానికే కాదు చర్మం అందంగా ఉండడానికి కూడా సహాయపడుతుంది. చింతపండు, పాలు రెండింటిని మిక్సీలో వేసి మెత్తటి గుజ్జులా చేయాలి. ఆ పేస్టును ముఖానికి రాసుకుని కాసేపటి తర్వాత చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం మీది నల్ల మచ్చలు, ముడతలు తొలగిపోతాయి. 

పసుపుకొమ్ములను దోరగా వేగించి వాటిని మెత్తగా పొడిచేయాలి. ఆ పొడితో  నలుగు పెట్టుకుంటే శరీరం నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది. చర్మ సౌందర్యం పెరుగుతుంది.

ఆలివ్‌ లేదా బాదం నూనెను ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే  ముఖం కాంతిమంతంగా మారుతుంది. 

తులసి ఆకులను బాగా మెత్తగా నూరి, ముఖానికి రాసుకుంటే మచ్చలు, తొలగి పోయి ముఖం తాజాగా కనిపిస్తుంది.

స్పూను మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మిక్సీలో వేసి మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టులో కాస్త తేనె కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంలో వయసు పైబడుతున్న ఛాయలు కనిపించవు.

Read more