ఉదాసీనతే పెద్ద వైరస్‌!

ABN , First Publish Date - 2021-12-29T09:01:19+05:30 IST

దేశంలో కరోనా కొత్త రూపం ఓమిక్రాన్ వ్యాప్తి వేగంగా సాగుతోంది. తక్కువ తీవ్రమైనదైనప్పటికీ వ్యాప్తిలో వేగం వల్ల ప్రమాదకారిగా తయారైంది. ప్రపంచవ్యాప్తంగా గత వారంతో పోలిస్తే ఈ వారం 13శాతం కేసులు హెచ్చుగా...

ఉదాసీనతే పెద్ద వైరస్‌!

దేశంలో కరోనా కొత్త రూపం ఓమిక్రాన్ వ్యాప్తి వేగంగా సాగుతోంది. తక్కువ తీవ్రమైనదైనప్పటికీ వ్యాప్తిలో వేగం వల్ల ప్రమాదకారిగా తయారైంది. ప్రపంచవ్యాప్తంగా గత వారంతో పోలిస్తే ఈ వారం 13శాతం కేసులు హెచ్చుగా నమోదవడం పరిస్థితికి అద్దం పడుతోంది. కాబట్టి పైనుంచి ఎవరో ఆదేశిస్తారని చూడకుండా ఎవరికీ వారు క్రమశిక్షణ పాటించాల్సిన సందర్భం వచ్చింది. కేంద్రం 15ఏళ్ళు దాటినవారికి టీకా అందుబాటులోకి తీసుకురావడం, కరోనా పోరులో ముందువరుసలో ఉన్నవాళ్లకు అదనంగా ప్రికాషనరీ డోస్ అందించబోవడం అభినందనీయం. వాటితో బాటు మాస్కు వినియోగం తప్పనిసరి చెయ్యడం, గుంపుల్ని, ఊరేగింపుల్ని నిషేధించడం చెయ్యాలి. రానున్న మూడు మాసాల దాకా ఎన్నికలు జరపకుండా ఎన్నికల సంఘాన్ని కోరాలి. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు కొత్త సంవత్సర వేడుకల్ని రద్దు చెయ్యాలి. ముఖ్యంగా ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. ముందుజాగ్రత్తతోనే ముప్పు తప్పించగలగడమైనా, తగ్గించగలగడమైనా.  

డా. డి.వి.జి. శంకరరావు, 

మాజీ ఎంపీ, పార్వతీపురం. 


Updated Date - 2021-12-29T09:01:19+05:30 IST