తిమ్మాపూర్‌ హైవేను పట్టించుకోరూ...

ABN , First Publish Date - 2021-12-17T06:26:04+05:30 IST

కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం ప్రధాన విద్యాకేంద్రంగా పేరు పొందింది. దిగువ మానేరు నుండి (ఎల్‌ఎండి) తిమ్మాపూర్‌ మెయిన్‌రోడ్‌లో (రాజీవ్‌ రహదారి) మూడు ఇంజనీరింగ్‌ కళాశాలలు...

తిమ్మాపూర్‌ హైవేను పట్టించుకోరూ...

కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం ప్రధాన విద్యాకేంద్రంగా పేరు పొందింది. దిగువ మానేరు నుండి (ఎల్‌ఎండి) తిమ్మాపూర్‌ మెయిన్‌రోడ్‌లో (రాజీవ్‌ రహదారి) మూడు ఇంజనీరింగ్‌ కళాశాలలు, డైట్‌ కళాశాల, మోడల్‌ స్కూల్‌, ప్రభుత్వోన్నత పాఠశాలలు ఉన్నాయి. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో వాహనాలు వేగంగా పోతున్నందున ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్నారుల ప్రాణాలకు ముప్పు అధికంగా ఉండడంతో వారి భద్రత గురించి తల్లిదండ్రులు నిత్యం ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అయినా అధికారులు తమకేమీ పట్టనట్లు మిన్నకుండిపోతున్నారు. ఇప్పటికైనా వారు నిర్లక్ష్యాన్ని వీడి రాజీవ్‌ రహదారిపై స్పీడ్‌ బ్రేకర్లు వేయించాలి. స్కూల్‌ జోన్‌ వద్ద వాహనదారులు అతివేగంగా వెళ్లకుండా అడ్డుకునేందుకు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. భావిభారత పౌరులయిన చిన్నారులు, విద్యార్థుల ప్రాణాలకున్న విలువను గుర్తించి వాహనదారులు కూడా అప్రమత్తతతో, బాధ్యతతో వ్యవహరించి ప్రమాదాల నివారణకు తోడ్పడాలి.

డి. కిషన్‌ప్రసాద్‌

తిమ్మాపూర్‌, కరీంనగర్‌.


Read more