టెట్, టీఆర్టీల కోసం ఎదురుచూపులు!

ABN , First Publish Date - 2021-12-03T05:49:00+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల మంది డీఎడ్ బీఎడ్ అభ్యర్థులు గత నాలుగేళ్లుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం జారీ అయ్యే నోటిఫికేషన్ల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు....

టెట్, టీఆర్టీల కోసం ఎదురుచూపులు!

తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల మంది డీఎడ్ బీఎడ్ అభ్యర్థులు గత నాలుగేళ్లుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం జారీ అయ్యే నోటిఫికేషన్ల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. 2017 జూన్ లో టెట్, అక్టోబరులో టీఆర్టీ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. కేవలం 8792 ఖాళీలకు పరీక్ష నిర్వహించారు. ఏడేళ్ల తర్వాత విడుదల అయిన నోటిఫికేషన్ లో భారీగా ఖాళీలు ఉంటాయని ఆశించిన నిరుద్యోగ యువతకి ఆ అరకొర ఖాళీలు నిరాశ కలిగించాయి. ప్రతీ ఏటా వేల సంఖ్యలో అభ్యర్థులు డీఎడ్ బీఎడ్ కోర్సులను పూర్తి చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా నోటిఫికేషన్ రానందున నిరుద్యోగ ఉపాధ్యాయుల సంఖ్య ఐదు లక్షలకు చేరింది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీతోనే ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య సాధ్యం అవుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా టెట్ నిర్వహించాలని, టీఆర్టీ నోటిఫికేషన్లు, గురుకుల నోటిఫికేషన్లు జారీ చేయాలని మనవి.

రావుల రామ్మోహన్ రెడ్డి

డీఎడ్ బీఎడ్ అభ్యర్థుల సంఘం

Read more