విద్యార్థులపై దాడులు అమానుషం!

ABN , First Publish Date - 2021-11-10T06:03:03+05:30 IST

ఎయిడెడ్ విద్యాసంస్థలు విలీనం ఆపాలంటూ అనంతపురంలో విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు లాఠీచార్జ్ చేయడాని తీవ్రంగా ఖండిస్తున్నాను...

విద్యార్థులపై దాడులు అమానుషం!

ఎయిడెడ్ విద్యాసంస్థలు విలీనం ఆపాలంటూ అనంతపురంలో విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు లాఠీచార్జ్ చేయడాని తీవ్రంగా ఖండిస్తున్నాను అలాంటి దాడులు విద్యార్థులపై జరగడం బాధాకరం కనీసం ఆడపిల్లలు అని గౌరవం కూడా లేకుండా పోలీసులు ఇలాంటి వైఖరి ప్రదర్శిస్తున్నారంటే సమాజానికి ఎలాంటి సంకేతాలిస్తున్నారో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి విద్యార్థి ఉద్యమాలు ఇప్పటికే చరిత్రలో ఎన్నో విజయవంతం అయ్యాయి అలాంటిది పోలీసులతో ఉద్యమాన్ని ఆపాలి అనుకోవడం మూర్ఖత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 2,500 ఎయిడెడ్‌ పాఠశాలలు వాటిల్లో చదువుతున్న సుమారు రెండు లక్షల మంది విద్యార్థుల చదువులతో ప్రభుత్వం ఆడుతున్న ఈ చెడుగుడు అంతిమంగా విద్యార్థులు, తల్లిదండ్రులపైన తీవ్ర భారం మోపనుంది. ఏడాదికి 680 కోట్ల రూపాయల కోసం ఎయిడెడ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేస్తామనడం సమంజసం కాదు.

పద్మనాభుని మణిదీప్

Read more