వెండి కడియాల కోసం మహిళ కాళ్లు నరికి చంపిన Robber

ABN , First Publish Date - 2021-11-17T17:26:35+05:30 IST

వెండి కడియాల కోసం ఓ మహిళ కాళ్లు నరికి చంపిన దొంగ బాగోతం రాజస్థాన్ రాష్ట్రంలోని చార్‌భుజా గ్రామంలో తాజాగా జరిగింది...

వెండి కడియాల కోసం మహిళ కాళ్లు నరికి చంపిన Robber

జైపూర్ (రాజస్థాన్): వెండి కడియాల కోసం ఓ మహిళ కాళ్లు నరికి చంపిన దొంగ బాగోతం రాజస్థాన్ రాష్ట్రంలోని చార్‌భుజా గ్రామంలో తాజాగా జరిగింది. రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లా చార్‌భుజా పోలీస్ స్టేషన్ పరిధిలోని పొలంలో 45 ఏళ్ల మహిళ మృతదేహం నరికివేసిన పాదాలతో పడి ఉండగా పోలీసులు కనుగొన్నారు.ఘటన సమయంలో మహిళ ధరించిన వెండి కడియాలను దొంగిలించేందుకు ఓ దొంగ ఆమె పాదాలను నరికి చంపాడని పోలీసులు తెలిపారు. నిందితులు మహిళ మెడపై కూడా దాడి చేయడంతో మహిళ మృతి చెందింది.మృతి చెందిన మహిళను కంకుబాయిగా పోలీసులు గుర్తించారు.పొలంలో పనిచేస్తున్న భర్త కోసం కంకుబాయి ఇంటి నుంచి భోజనం తీసుకొని వస్తుండగా ఈ హత్య జరిగింది. 


అయితే కంకుబాయి తన భర్త పనిచేస్తున్న పొలానికి చేరుకోలేదు.కంకుబాయి భర్త ఇంటికి తిరిగి వచ్చి అతను పిల్లలను వారి తల్లి ఎక్కడ అని అడిగాడు. కంకుబాయి ఉదయాన్నే పొలానికి భోజనం తీసుకుని వెళ్లిందని పిల్లలు చెప్పారు.కంకుబాయి బంధువులు, స్థానికులు రాత్రి వరకు వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో చరభుజ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు.మహిళ హత్య కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని రాజ్‌సమంద్ ఎస్పీ శివలాల్ తెలిపారు.గతంలో ఓ మహిళ పాదాలు నరికి చంపిన ఘటన జరిగింది. జైపూర్‌లో కొద్ది రోజుల క్రితం పొలంలో పశువులు మేపేందుకు వెళ్లిన ఓ మహిళ శవమై కనిపించింది.దొంగలు వెండి కడియాల కోసం ఆమె పాదాలు కూడా నరికివేశారు. 


Read more