జూడో నేర్చుకున్న పదిహేనేళ్ల బాలుడు..21 ఏళ్ల మహిళను ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2021-10-28T17:49:34+05:30 IST

FIFTEEN Year Old Kerala Boy Dragged Woman Tried To Rape Her sks FIFTEEN Year Old Kerala Boy Dragged Woman Tried To Rape Her sks FIFTEEN Year Old Kerala Boy Dragged Woman Tried To Rape Her sks

జూడో నేర్చుకున్న పదిహేనేళ్ల బాలుడు..21 ఏళ్ల మహిళను ఏం చేశాడంటే...

మలప్పురం (కేరళ): జూడో నేర్చుకున్న 15 ఏళ్ల బాలుడు 21 ఏళ్ల వయసున్న మహిళను పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచార యత్నం చేసిన దారుణ ఘటన కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లా కొండట్టి ప్రాంతంలో వెలుగుచూసింది. తన పొరుగింట్లో ఉంటున్న పదిహేనేళ్ల బాలుడు 21 ఏళ్ల మహిళను ప్లాంటేషన్ ప్రాంతానికి ఈడ్చుకువెళ్లి తలపై కొట్టి, దుపట్టాతో చేతులు కట్టి అత్యాచారం జరిపేందుకు యత్నించాడు.నూనూగు మీసాలు కూడా రాని బాలుడు మహిళపై ఈ దారుణానికి పాల్పడటం సంచలనం రేపింది. మార్షల్ ఆర్ట్ జూడోలో శిక్షణ పొందిన బాలుడు తన కంటే ఎక్కువ వయసున్న మహిళను బలవంతం చేశాడు.


 హిళ ప్రతిఘటించడంతో నిందితుడైన బాలుడు పారిపోయాడు. నిందితుడి నుంచి తప్పించుకున్న బాధితురాలు సమీపంలోని ఇంటికి వచ్చింది. నిందితుడైన బాలుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పర్చారు. తదుపరి వైద్య పరీక్షల కోసం అతడిని జువైనల్ హోంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.నిర్మానుష్య ప్రదేశం కావడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు చెప్పారు. గాయపడిన బాధిత మహిళను కోజికోడ్ మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజ్ సాయంతో పోలీసులు బాలుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Updated Date - 2021-10-28T17:49:34+05:30 IST