బండిల్డ్ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను ప్రకటించిన ఎయిర్‌టెల్

ABN , First Publish Date - 2021-09-03T22:50:42+05:30 IST

ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో బండిల్డ్ ప్రీపెయిడ్

బండిల్డ్ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను ప్రకటించిన ఎయిర్‌టెల్

న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో బండిల్డ్ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను విడుదల చేసింది. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాలు ఇప్పటికే ఇలాంటి బండిల్డ్ ప్లాన్లను విడుదల చేశాయి. తాజాగా రూ. 499తో ఎయిర్‌టెల్ ప్రకటించిన ఈ రీచార్జ్ ప్లాన్ కాల పరిమితి 28 రోజులు, రోజుకు 3జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత కాల్స్, ఏడాది పాటు ఉచితంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్సన్ వంటివి లభిస్తాయి. అలాగే, ఉచిత హలో ట్యూన్స్, 30 రోజులపాటు అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్ ట్రయల్, ఇతర ప్రయోజనాలు ఎయిర్‌టెల్ వినియోగదారులకు లభిస్తాయి. 


రూ. 699తో తీసుకొచ్చిన మరో ప్లాన్‌లో అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా లభిస్తాయి. కాలపరిమితి 56 రోజులు, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఇందులోనూ డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్సన్ ఏడాది పాటు ఉచితంగా లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్  సబ్‌స్క్రిప్షన్ 30 రోజులపాటు లభిస్తుంది. మిగతా ప్రయోజనాలన్నీ రూ.499 ప్లాన్‌లో ఉన్నట్టుగానే లభిస్తాయి. 


రూ.2798తో తీసుకొచ్చిన మూడో ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా రూ.365 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. ఇందులోనూ పూర్తి ఉచితంగా అపరిమిత లోకల్ కాల్స్ లభిస్తాయి.  రూ.699 ప్లాన్‌లోని ప్లాన్‌లోని అన్ని ప్రయోజనాలు ఇందులోనూ ఉంటాయి.   

Updated Date - 2021-09-03T22:50:42+05:30 IST