వర్షాకాలంలో ఎండాకాలం

ABN , First Publish Date - 2021-08-26T05:24:22+05:30 IST

వర్షాకాలం ఎండాకాలంగా మారింది.

వర్షాకాలంలో ఎండాకాలం
నిర్మానుష్యంగా ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌

ఏలూరు రూరల్‌, ఆగస్టు 25 : వర్షాకాలం ఎండాకాలంగా మారింది. వారం రోజులుగా ఎండలు ముదిరాయి. భానుడు ఉగ్రరూపం ప్రదర్శించ డంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. గతంలో ఎన్నడూలేని విధంగా వానాకాలంలో ఎండాకాలంలా మారింది. బుధవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎండ తీవ్రత కనిపించింది. ప్రధాన రోడ్లు జన సంచారం లేక బోసిపోయి కనిపించాయి. ఎండకు ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతలపానీయాలను ఆశ్రయిస్తున్నారు. బయటకు వచ్చిన వారు టోపీ లు, గొడుగులు, కండువాలు తలపై కప్పుకుని బయటకు వచ్చారు. కార్మికులు, వ్యవసాయ పనులకు వెళ్లేవారు ఎండ వేడికి ఇబ్బందులు పడ్డారు. 

Updated Date - 2021-08-26T05:24:22+05:30 IST