ప్రమాదకరంగా మలుపులు

ABN , First Publish Date - 2021-12-20T04:52:58+05:30 IST

ఏలూరు నగరంలోని ప్రధాన రహ దారులు, లింకు రోడ్లు మలుపులు ప్రమాదాలకు నిలయంగా మారాయి.

ప్రమాదకరంగా మలుపులు

 ధ్వంసమైన రోడ్లతో వాహనదారులు ప్రమాదాల పాలు

ఏలూరు కార్పొరేషన్‌, డిసెంబరు 19: ఏలూరు నగరంలోని ప్రధాన రహ దారులు, లింకు రోడ్లు మలుపులు ప్రమాదాలకు నిలయంగా మారాయి. రోడ్లు నిర్మించినా మలుపుల్లో రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల తరచూ ప్రమా దాలు జరుగుతున్నాయి. డ్రెయినేజీల వద్ద, రోడ్ల జాయింట్ల వద్ద రోడ్లు వేసిన కొద్ది రోజులకే శిఽథిలమైపోతున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తు న్నారు. ఉదాహరణకు పాతబస్టాండ్‌ నుంచి వీవీనగర్‌ వెళ్లే రహదారిలోని ఫ్లయ్‌వోవర్‌ బ్రిడ్జి కింద మలుపులో ఎటువంటి రక్షణ చర్యలు లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలకు నిలయంగా మారింది. పాలకులు చర్యలు తీసుకుని మలుపుల్లో ప్రమాదాలు జరగకుండా డ్రెయినేజీలపై శ్లాబ్‌ మూతలు వేయించా లని, మలుపుల్లో చదును చేయించాలని ప్రజానీకం కోరుతు న్నారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


Updated Date - 2021-12-20T04:52:58+05:30 IST