రైతు దగా దినోత్సవం

ABN , First Publish Date - 2021-07-09T05:22:02+05:30 IST

ఓ వైపు ప్రభుత్వం రైతు దినోత్సవం జరుపుతుంటే.. ప్రతిపక్ష తెలుగు దేశం మాత్రం జరపాల్సింది.. రైతు దగా దినోత్సవమని జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.

రైతు దగా దినోత్సవం
పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, పార్టీ నేతలు

జిల్లావ్యాప్తంగా టీడీపీ నిరసనలు


పాలకొల్లు అర్బన్‌/ఏలూరు ఫైర్‌స్టేషన్‌, జూలై 8 : ఓ వైపు ప్రభుత్వం రైతు దినోత్సవం జరుపుతుంటే.. ప్రతిపక్ష తెలుగు దేశం మాత్రం జరపాల్సింది.. రైతు దగా దినోత్సవమని జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్‌లో గురువారం ఉదయం టీడీపీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.రాష్ట్ర వైసీపీ పాలనలో చేసుకోవాల్సింది రైతు దినోత్సవం కాదు.. రైతు దగా దినోత్సవమని విమర్శించారు. వరుసగా పంటలు నష్టపోతున్నప్పటికీ రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ  కానీ, ఇన్సూ రెన్సు కానీ ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవడం లేదని విమర్శించా రు. ప్రజలపై పన్నుల భారం మోపడంపై ఉన్న శ్రద్ధ రైతుల పై కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఆం ధ్రప్రదేశ్‌గా తీర్చి దిద్దుతున్నారని, ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమని దుయ్యబ ట్టారు. 64 లక్షల మంది రైతులకు ఆర్థిక సాయం అందిస్తా మని చెప్పి, 45 లక్షలకు కుదించారన్నారు. కార్యక్రమంలో పట్టణ, మూడు మండలాల నాయకులు కార్యకర్తలు, బోనం నాని, జి.సూర్యనారాయణరాజు, కోడి విజయభాస్కర్‌, జీవీ, పెచ్చెట్టి బాబు తదితరులు పాల్గొన్నారు. రెండేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదని టీడీపీ ఏలూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు విమర్శించారు. ఏలూరులోని పార్టీ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేసి, విలేకరులతో మాట్లాడారు. వరుస ప్రకృతి విపత్తుల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతు భరోసా కేంద్రాలు వైసీపీ కార్యకర్తల నిలయాలుగా మారాయన్నారు. ధాన్యం కనీస మద్దతు ధర 1,888 ఉండగా, రైతులకు 1,300 నుంచి 1,400 మాత్రమే దక్కుతుందన్నారు. పెసర, మినుములు, కందులు, అపరాలు, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ పంటలకు, టమోటా పంటల కు కనీస మద్దతు ధర లభించక రైతులు నష్టపోతు న్నారన్నారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లు బిగించి రైతు మెడకు ఉరితాడు వేస్తున్నారన్నారు. ఏలూరు నియోజ కవర్గ కన్వీనర్‌ బడేటి రాథాకృష్ణ (చంటి), పార్టీ జిల్లా కార్యా లయ సమన్వయ కార్యదర్శి పాలి ప్రసాద్‌, రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు, జయరాజు పాల్గొన్నారు. 


సబ్సిడీ యంత్రాల్లో తిరకాసు 


ఏలూరు రూరల్‌, జూలై 8 : రైతులకు భారీ రాయితీ యంత్రాల పంపిణీ అంటూ ప్రభుత్వం చేసిన ఆర్భాటం ఆచరణలో కనిపించలేదు. ముందు సబ్సిడీ చెల్లిస్తేనే ఖాతా లో అసలు జమ చేస్తామని మెలిక పెట్టడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌బీకే పరిధిలో ఏర్పాటై న రైతు గ్రూపు(కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌)లకు రూ.15 లక్ష ల విలువైన వ్యవసాయ పరికరాలను అందించనున్నారు. యంత్రం ఖర్చు మొత్తంలో 50 శాతం బ్యాంకు రుణం, 40 శాతం ప్రభుత్వ సబ్సిడీగా అందిస్తుండగా పది శాతం రైతు గ్రూపులు భరించాలి. ముందుగా ఈ సొమ్మును జమ చేస్తేనే సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేస్తామని చెప్పడంతో రైతులు మండిపడుతున్నారు.Updated Date - 2021-07-09T05:22:02+05:30 IST