ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ జాబ్‌ క్యాలెండర్‌ వద్దు

ABN, First Publish Date - 2021-06-26T05:25:08+05:30

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ అసంపూర్తిగా ఉందని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు అన్నారు.

పాలకొల్లులో నినాదాలు చేస్తున్న డీవైఎఫ్‌ఐ,ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకుల నిరసన   

పాలకొల్లు అర్బన్‌, జూన్‌ 25 : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ అసంపూర్తిగా ఉందని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు అన్నారు. జాబ్‌ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా శుక్రవారం పట్టణంలో యడ్లబజారు, గాంధీ బొమ్మల సెంటర్లలో నిరసన ప్రదర్శన చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్య క్షుడు కె.సూర్య మాట్లాడుతూ అన్ని ఉద్యోగాలతో కలిపి కొత్త జాబ్‌ క్యాలెం డర్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.పోలీస్‌, టీచర్‌, లైబ్రేరియన్‌, విద్యుత్‌ తదితర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు, బ్యాక్‌లాగ్‌ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్ర మంలో  పట్టణ ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి యశ్వంత్‌, నాయకులు శివ, అనిల్‌ బాబు, బాను తదితరులు పాల్గొన్నారు. 


బీజేవైఎం అర్ధనగ్న ప్రదర్శన

నరసాపురం, జూన్‌ 25 : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ను నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు శుక్రవారం నరసాపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేశారు. జాబ్‌ క్యాలెండర్‌ను వెంటనే రద్దు చేసి 2.40 లక్షల ఉద్యోగాలతో కూడిన జాబ్‌ క్యాలెండర్‌ను విడు దల చేయాలని నాయకుడు లీలా కృష్ణ డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-06-26T05:25:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising