17లోగా బ్యాక్‌లాగ్‌ పోస్టులపై అభ్యంతరాలు తెలపాలి

ABN , First Publish Date - 2021-07-08T05:48:16+05:30 IST

ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన విభిన్న ప్రతిభా వంతుల బ్యాక్‌లాగ్‌ పోస్టులకు తిరస్కరణకు గురైన వారి జాబితా ప్రకటించామని, అభ్యంతరాలుంటే ఈ నెల 17వ తేదీలోగా తెలియజేయాలని విభిన్న ప్రతిభా వంతుల శాఖ సహాయ సంచాలకులు డాక్టర్‌ ఎం. ఝాన్సీరాణి ఒక ప్రకటనలో తెలిపారు.

17లోగా బ్యాక్‌లాగ్‌ పోస్టులపై అభ్యంతరాలు తెలపాలి

ఏలూరు కలెక్టరేట్‌, జూలై 7: ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన విభిన్న ప్రతిభా వంతుల బ్యాక్‌లాగ్‌ పోస్టులకు తిరస్కరణకు గురైన వారి జాబితా ప్రకటించామని, అభ్యంతరాలుంటే ఈ నెల 17వ తేదీలోగా తెలియజేయాలని విభిన్న ప్రతిభా వంతుల శాఖ సహాయ సంచాలకులు డాక్టర్‌ ఎం. ఝాన్సీరాణి ఒక ప్రకటనలో తెలిపారు. 17వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా కలెక్టరేట్‌ కాంపౌండ్‌లో ఉన్న శాఖ కార్యాలయంలో సంప్రదించి రాతపూర్వకంగా సరైన ధ్రువపత్రాలు సమర్పించాల న్నారు. అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దని, ఎవరైనా ప్రలోభ పెడితే కలెక్టర్‌, పోలీస్‌ స్టేషన్‌లో గాని ఫిర్యాదు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2021-07-08T05:48:16+05:30 IST