విద్యుత్‌ను ఆదా చేద్దాం

ABN , First Publish Date - 2021-12-19T06:28:11+05:30 IST

విద్యుత్‌ను ఆదా చేయ డం ప్రతి ఒక్కరి బాధ్యతని ఏపీఈపీడీసీఎల్‌ జిల్లా ఎస్‌ ఈ ఎస్‌.జనార్దనరావు అన్నారు.

విద్యుత్‌ను ఆదా చేద్దాం

ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ జనార్దనరావు 

ఏలూరు సిటీ, డిసెంబరు 18 : విద్యుత్‌ను ఆదా చేయ డం ప్రతి ఒక్కరి బాధ్యతని ఏపీఈపీడీసీఎల్‌ జిల్లా ఎస్‌ ఈ ఎస్‌.జనార్దనరావు అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా స్థానిక విద్యుత్‌ భవన్‌లో శనివారం జిల్లాలోని పారిశ్రా మికవేత్తలు, వినియోగదారులతో సమావేశం నిర్వహించారు. విద్యుత్‌ పొదుపుపై అవగాహన కలిగించారు. ఇంధనం వృఽథా చేస్తే భావితరాలు ఇబ్బందికర పరిస్థితు లు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. బొగ్గు, ఆయిల్‌ నిల్వలు తరిగి పోతున్నాయ న్నారు. వీటిని కాపాడుకోవాలంటే ఇంధన పొదుపుతోనే సాధ్యమన్నారు. జిల్లాలో గత ఏడాది 22 సబ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసి లోఓల్టేజి సమస్యను పరిష్కరించామ న్నారు. విద్యుత్‌ సమస్యలు ఏమైనా ఉంటే అధికారులు, సిబ్బంది సమన్వయంతో పరిష్కరిస్తామ న్నారు. జిల్లాలో పరిశ్రమలు స్థాపిస్తే అందుకవసరమైన విద్యుత్‌ పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామన్నారు. ఈఈలు జి.శ్యాంబాబు, అంబేడ్కర్‌, ఏడీఈలు వేణు గోపాల్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-12-19T06:28:11+05:30 IST