కుంటుతున్న ప్రగతి రథచక్రాలు

ABN , First Publish Date - 2021-12-20T05:17:36+05:30 IST

ఏపీఎస్‌ఆర్‌టీసీ జంగారెడ్డిగూడెం డిపో బస్సులకు ఏమైంది..?

కుంటుతున్న ప్రగతి రథచక్రాలు
మద్ది ఆలయం వద్ద ఆగిన బస్సు

జంగారెడ్డిగూడెం టౌన్‌, డిసెంబరు 19: ఏపీఎస్‌ఆర్‌టీసీ జంగారెడ్డిగూడెం డిపో బస్సులకు ఏమైంది..? ప్రమాదాలకు గురవుతున్నాయి. మరమ్మతులతో రోడ్లపై ఆగివపోతున్నాయి. 15న జల్లేరు వాగులో బస్సు బోల్తాపడి 10 మంది మృతి చెందిన సంఘటన మరువ కముందే 17న  85 మంది ప్రయాణికు లతో ఏలూరు వెళ్తున్న బస్సు క్లచ్‌ వదిలేయడంతో ప్రయాణికులు భయ పడ్డారు. మార్గమధ్యలో సోమవరప్పా డు వద్ద క్లచ్‌ వదిలేయడంతో పెనుప్రమాదం నుంచి తప్పించుకొని మద్యలోనే ఆగిపోయింది. ఆదివారం మద్ది ఆంజనేయస్వామి ఆలయం వద్ద మరొక బస్సు   నిలిచిపోయింది. ప్రతీరోజు బస్సులు చెక్‌చేస్తాం, రిమార్కులను గుర్తించి మరమ్మతు చేస్తామని చెప్పిన ఆర్టీసీ అధికారులు ఏం సమాధానం చెబుతారో...?

జంగారెడ్డిగూడెం డిపోలో 64 ప్రభుత్వ బస్సులు ఉండగా, 22 అద్దె బస్సులు ఉన్నాయి.  రోజుకు సుమారు 9 లక్షల టర్నోవర్‌ నిర్వహించే జంగారెడ్డిగూడెం డిపోలో 80 శాతానికి పైగా బస్సులు షెడ్డుకు వెళ్ళే స్దితిలో ఉన్నాయని, క్షేమంగా గమ్యస్దానానికి తిరిగొచ్చే కండిషన్‌లో బస్సులు లేవని ప్రయాణికులు చెబుతున్నారు.

Updated Date - 2021-12-20T05:17:36+05:30 IST