భూసారం తేలేదెలా..?

ABN , First Publish Date - 2021-05-08T06:09:23+05:30 IST

వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలంటే ఎప్పటికప్పు డు భూసార విలువలను తెలుసుకోవాలి.

భూసారం తేలేదెలా..?

కేంద్రాల్లో రెండేళ్లుగా పరీక్షల నిలిపివేత

 ఆర్‌బీకేల్లో మినీ ల్యాబ్‌ల ఏర్పాటు.. ఇక్కడ పరీక్షలు నామమాత్రమే

ఏలూరు సిటీ, మే 7 : వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలంటే ఎప్పటికప్పు డు భూసార విలువలను తెలుసుకోవాలి. ఈ భూసార పరీక్షలను తాడేపల్లిగూడెం భూసార పరీక్ష కేంద్రంలో పరీక్షించి ఫలితాలను తెలిపేవారు. వీటిని బట్టి రైతులు సాగు చేసి మంచి దిగుబడులు సాధించేవారు. రెండేళ్లుగా ఈ పరిస్థితులు కనిపించడం లేదు. కేంద్రం ఈ పరీక్షలకు కొంత నిధులు ఇచ్చేది. మిగిలిన సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి ఏటా నిర్వ హించేవారు. రెండేళ్లుగా కేంద్రం నుంచి భూసార పరీక్షలకు ఎటువంటి నిధులు రావడం లేదు. దీంతో ఇవి నామమాత్రంగానే జరుగుతున్నాయి. మరోవైపు రైతు భరోసా కేంద్రాల ద్వారానే భూసార పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు మం డలానికి రెండేసి ల్యాబ్‌ల చొప్పున జిల్లాలో 100 మినీ ల్యాబ్‌లు ఏర్పాటుచేశారు. ల్యాబ్‌లలో పని చేసే వ్యవసాయ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ప్రతి వీఏఏ పరిఽధిలో ఐదు శాంంపిల్స్‌ సేకరించాలని నిబంధన ఉంది. మండలాల్లోని రెండు మినీ ల్యాబ్‌లలో మొక్కుబడిగా కూడా పరీక్షలు నిర్వహించడం లేదు. గట్టిగా అడిగిన రైతుల పంట పొలాల్లో శాంపిల్స్‌ సేక రించి భూసార పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ మినీ ల్యాబ్‌లు ఏర్పాటుతో తాడే పల్లిగూడెం వ్యవసాయ భూసార పరీక్షల కేంద్రంలో ఎటువంటి పరీక్షలు నిర్వహించడం లేదు. జిల్లాలో మొత్తం 2.86 లక్షల హెక్టార్లలో వివిధ ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. ఏటా మార్చి చివరి నాటికి పంటలన్నీ చేతికొచ్చేవి. ఏప్రిల్‌, మే నెలల్లో ఖాళీగావున్న భూముల్లో ఈ భూసార పరీక్షలు నిర్వహించేవారు. భూసారం ఏ మేరకు ఉంది, ఏఏ రకాల ఎరువులు వాడాలి, ఏఏ పంటలు సాగు చేయవచ్చనేవివరాలతో ప్రత్యేక కార్డులు ఇచ్చేవారు. రెండేళ్లుగా ఈ ఊసే లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భూసార పరీక్షలను గతంలో మాదిరిగా చేయిస్తే వ్యవసాయ సాగులో మంచి ఫలితాలను సాధించ టానికి అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు.



Updated Date - 2021-05-08T06:09:23+05:30 IST