విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు

ABN , First Publish Date - 2021-12-20T04:57:18+05:30 IST

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని జనసేన రాష్ట్ర నాయకుడు తోట వాసు అన్నారు.

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు
వీరవాసరంలో ప్లకార్డులతో ఆందోళన చేస్తున్న జనసేన నాయకులు

ఆకివీడు, వీరవాసరంలో జన సైనికుల నిరసన


ఆకివీడు/వీరవాసరం, డిసెంబరు 19 : విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని జనసేన రాష్ట్ర నాయకుడు తోట వాసు అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఇచ్చిన పిలుపు మేరకు  ఆదివారం ఆకివీడు,వీరవాసరంలో ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేశారు.  ప్రభుత్వ పరిశ్రమలన్నీ ప్రైవేటీకరిస్తే యువత నిరుద్యోగులు అవుతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత అభివృద్ధిని గాలికొదిలేసి కక్షలకు శ్రీకారం చుట్టిందన్నారు.పార్లమెంట్‌ వద్ద ఎంపీలు ప్లకార్డులతో నిరసనలు తెలియచేసి ఏపీ ఉక్కు కర్మాగారాన్ని సంరక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్‌ గోపిశెట్టి వెంకట సత్యవతి, నేరెళ్ళ ప్రసన్న, దుంపగడప వార్డు సభ్యురాలు నిర్మల జ్యోతి, చిరంజీవి సత్యనారాయణ, గవర అనిల్‌, కొటికలపూడి తాతాజీ, తమ్మిశెట్టి కాశీవిశ్వేశ్వరరావు, ఆముదాల నాని,జడ్పీటీసీ గుండా జయప్రకాష్‌నాయుడు, మండలశాఖ అధ్యక్షుడు గుండా రామకృష్ణ, సర్పంచ్‌లు వేండ్ర లీలా వెంకట కృష్ణ , యర్రంశెట్టి నాగసాయి, కారిపల్లి శాంతిప్రియ, గ్రంధి రత్నకిషోర్‌, ఎంపీటీసీలు గుల్లిపల్లి విజయలక్ష్మి,ఉదయభాస్కరరావు పాల్గొన్నారు.


నేడు ఆచంటలో నిరసన


ఆచంట, డిసెంబరు 19 : ఆచంట కచేరి సెంటర్‌లో సోమవారం విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేయను న్నట్టు జనసేన నాయకులు తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో జరిగే కార్యక్ర మానికి పెద్ద ఎత్తున జనసైనికులు రావాలని కోరారు.

Updated Date - 2021-12-20T04:57:18+05:30 IST