ఉద్యాన కోర్సులకు ఉజ్వల భవిష్యత్తు
ABN , First Publish Date - 2021-12-19T05:58:35+05:30 IST
ఉద్యాన కోర్సులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని వెంకట్రామన్నగూడెం లోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యా లయ వైస్‌చాన్సలర్ డాక్టర్ టి.జానకిరామ్ అన్నారు.
తాడేపల్లిగూడెం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఉద్యాన కోర్సులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని వెంకట్రామన్నగూడెం లోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యా లయ వైస్‌చాన్సలర్ డాక్టర్ టి.జానకిరామ్ అన్నారు. విశ్వవిద్యాలయంలో శనివారం ఉద్యాన పీజీ కోర్సులో ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించారు. భారత వ్యవసాయ పరిశో ధన మండలి నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన 155 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో 50 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కలిసిన వైస్‌చాన్సలర్ ఉద్యాన పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.