ఇద్దరు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-20T06:33:54+05:30 IST

మద్యానికి బానిసలైన ఇద్దరు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు.

ఇద్దరు ఆత్మహత్య

మద్యానికి బానిసలు కావడంతో దెబ్బతిన్న ఆరోగ్యం

ఆ ఆవేదనతోనే అఘాయిత్యం

కూర్మన్నపాలెం, అక్టోబరు 19: మద్యానికి బానిసలైన ఇద్దరు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. దువ్వాడ సీఐ లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం...జీవీఎంసీ 87వ వార్డు కణితి గాంధీ బొమ్మ ప్రాంతానికి చెందిన స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికులు ప్రగడ గోవిందరాజులు (49), దుగ్గపు పద్మ లోషన్‌(50) మద్యానికి బానిసలయ్యారు. దీంతో గోవిందరాజులు భార్య  పదేళ్ల క్రితం తన ఇద్దరు పిల్లలను తీసుకుని శ్రీకాకుళంలో వున్న కన్న వారింటికి వెళ్లిపోయింది. అలాగే పద్మ లోషన్‌ భార్య కూడా తన కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో వీరిద్దరూ పదేళ్ల నుంచి కణితిలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. నెలలో వారం, పది రోజులు డ్యూటీకి వెళ్లడం, ఆ వచ్చిన సొమ్ముతో మద్యం తాగడం చేసేవారు. ఈ నేపథ్యంలో ఇద్దరి ఆరోగ్యం కొద్దినెలలుగా క్షీణించింది. దీంతో మనస్తాపానికి గురైన వీరు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. గోవిందరాజులు ఉరి వేసుకుని మృతిచెందగా,  పద్మ లోషన్‌ మృతదేహం ఆరుబయట లభ్యమైంది. పద్మలోషన్‌ ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నదీ దర్యాప్తులో వెల్లడవుతుందని సీఐ తెలిపారు. ఆత్మహత్యలుగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


మరో 33 మందికి కరోనా 

విశాఖపట్నం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో 33 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు మంగళవారం నిర్ధారణ అయింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,57,854కు చేరింది. ఇందులో 1,55,967 మంది కోలుకోగా, మరో 793 మంది ఇళ్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కొవిడ్‌తో 1 094 మంది మృతిచెందారు.

Updated Date - 2021-10-20T06:33:54+05:30 IST