నేడు రిపబ్లికన్‌ పార్టీ రాష్ట్ర స్థాయి సదస్సు

ABN , First Publish Date - 2021-12-19T05:55:05+05:30 IST

బహుజనుల ఐక్యత చాటిచెప్పే లక్ష్యంతో రిపబ్లి కన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా జాతీయ సదస్సు ఆదివారం నిర్వహిస్తున్నట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మోహన్‌లాల్‌పాటిల్‌ తెలిపారు.

నేడు రిపబ్లికన్‌ పార్టీ రాష్ట్ర స్థాయి సదస్సు
సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మోహన్‌లాల్‌

సీతంపేట, డిసెంబరు 18: బహుజనుల ఐక్యత చాటిచెప్పే లక్ష్యంతో రిపబ్లి కన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా జాతీయ సదస్సు ఆదివారం నిర్వహిస్తున్నట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మోహన్‌లాల్‌పాటిల్‌ తెలిపారు. పౌరగ్రంథాలయంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బొడ్డు కల్యాణరావు ఆధ్వర్యంలో శనివారం నిర్వహిం చిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 


రామాటాకీస్‌ రోడ్డులోని అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహించనున్న సదస్సులో బడుగు, బలహీన వర్గాల సమస్యలు తెలు సుకోవడం, బహుజనులను రాజ్యాధికా రం దిశగా నడిపించడం లక్ష్యమని చెప్పా రు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే సదస్సులో పార్టీ అధ్యక్షుడు దీపక్‌బాహు నిఖల్‌జి పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. 


ఈ సమావే శంలో రిపబ్లికన్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆరిఫ్‌ హుస్సేన్‌,కార్మిక విభాగం అధ్య క్షుడు బాలభాస్కరరావు, మహిళా నాయకురాలు రాజాన సరస్వతి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-19T05:55:05+05:30 IST