హెచ్‌పీసీఎల్‌కు భారీ పైప్‌ ర్యాక్‌ మాడ్యుల్స్‌

ABN , First Publish Date - 2021-10-29T04:57:49+05:30 IST

హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) అభివృద్ధిలో భాగంగా చెన్నై నుంచి రెండు భారీ పైప్‌ ర్యాక్‌ మాడ్యూల్స్‌ను సముద్ర మార్గం ద్వారా తీసుకొచ్చినట్టు సంస్థ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

హెచ్‌పీసీఎల్‌కు భారీ పైప్‌ ర్యాక్‌ మాడ్యుల్స్‌
హెచ్‌పీసీఎల్‌ కోసం చెన్నై నుంచి వచ్చిన పైప్‌ ర్యాక్‌ మాడ్యూల్స్‌

మల్కాపురం, అక్టోబరు 28: హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) అభివృద్ధిలో భాగంగా చెన్నై నుంచి రెండు భారీ పైప్‌ ర్యాక్‌ మాడ్యూల్స్‌ను సముద్ర మార్గం ద్వారా తీసుకొచ్చినట్టు సంస్థ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ర్యాక్‌ మాడ్యూల్స్‌ను హెచ్‌పీసీఎల్‌ విస్తరణ పనులలో ఉపయోగించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం విశాఖ పోర్టు జట్టీలో ఉన్నాయని వివరించారు. ఇవి 14 మీటర్ల ఎత్తు, 12 మీటర్ల వెడల్పు, 30 మీటర్ల పొడవు ఉంటాయని, ఒక్కొక్కదాని బరువు 600 టన్నులు ఉంటుందని తెలిపారు. వీటిని ఆర్‌యూఎఫ్‌ యూనిట్‌లో ఉపయోగించనున్నట్టు వివరించారు. ఈ రెండింటిని త్వరలోనే హెచ్‌పీసీఎల్‌కు రోడ్డు మార్గం ద్వారా ప్రత్యేక వాహనంలో తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-29T04:57:49+05:30 IST