కృష్ణా యాజమాన్య బోర్డు తరలింపు.. తుగ్లక్ నిర్ణయం: తులసీ రెడ్డి

ABN , First Publish Date - 2021-01-20T18:57:12+05:30 IST

కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖలో పెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించడం పిచ్చి...

కృష్ణా యాజమాన్య బోర్డు తరలింపు.. తుగ్లక్ నిర్ణయం: తులసీ రెడ్డి

విజయవాడ: కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖలో పెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించడం పిచ్చి తుగ్లక్ నిర్ణయమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసీ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  బోర్డు కార్యాలయాన్ని నదీ పరివాహక ప్రాంతంలోని కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలని సూచించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని, అవినీతి జరగలేదని, హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాజధాని తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వెంకటేశ్వరస్వామినే మోసం చేసిన బీజేపీ ఆలయాల యాత్ర చేపట్టడం విడ్డూరమన్నారు. బీజేపీది దొంగ కొంగ జపమని ఎద్దేవా చేశారు. వైసీపీ, జనసేన పార్టీలు దుష్ట చతుష్ట పార్టీలని, ఆ పార్టీలను తిరుపతి ఓటర్లు తరిమికొట్టారని తులసీ రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-01-20T18:57:12+05:30 IST