శబరిమల భక్తులకు త్రివేండ్రం సమీపంలో రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2021-12-19T17:12:04+05:30 IST
శబరిమల భక్తులకు త్రివేండ్రం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నుంచి..
కర్నూలు : శబరిమల భక్తులకు త్రివేండ్రం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నుంచి కొందరు భక్తులు శబరిమల దర్శనానికి వెళ్ళారు. ఆగి ఉన్న టిప్పర్‌ను స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.