అపూర్వం ఈ కలయిక

ABN , First Publish Date - 2021-10-25T06:27:15+05:30 IST

మండలంలోని దొనకొండ జడ్పీ ఉన్నత పాఠశాల 1979-80లో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం ఈ పాఠశాల ఆవరణలో సమావేశమయ్యారు.

అపూర్వం ఈ కలయిక
కృష్ణారెడ్డిని సన్మానిస్తున్న విద్యార్థులు

ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

దొనకొండ, అక్టోబరు 24 : మండలంలోని దొనకొండ జడ్పీ ఉన్నత పాఠశాల 1979-80లో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం ఈ పాఠశాల ఆవరణలో సమావేశమయ్యారు. పాఠశాల వద్దకు చేరుకున్న వారు ఒకరినొకరు ఆలింగనమం చేసుకుంటూ ఆనందంగా ఉదయం నుంచిసాయంత్రం వరకు ఆటపాటలతో గడిపారు. నాడు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల ఆవరణ మొత్తం తిరిగి చదువుకునే రోజుల్లో అప్పటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామాంజనేయులు మాట్లాడుతూ పాఠశాల అభివృద్దికి పూర్వపు విద్యార్థుల సహకారం అభినందనీయమన్నారు. విద్యార్థులకు బుక్‌ కల్చర్‌ అలవాటు చేసేందుకు పాఠశాలలో అన్నీ సౌకర్యాలతో గ్రంథాలయం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. గ్రంథాలయం ఏర్పాటుకు సహకరిస్తామని పూర్వ విద్యార్థులు హమీ ఇచ్చారు. అనంతరం నాటి గురువు సుబ్బారెడ్డిని, ఎంఈవో సాంబశివరావు, హెచ్‌ఎం రామాంజనేయులు, పూర్వపు విద్యార్ధి కాకర్ల కృష్ణారెడ్డిలను శాలువాలతో సత్కరించారు. 42 ఏళ్ల తర్వాత మళ్లీ పూర్వ విద్యార్థులు ఒకచోట కలవడం ఆనందంగా ఉందన్నారు.

Updated Date - 2021-10-25T06:27:15+05:30 IST