స్వచ్ఛభారత్ బకాయిలు చెల్లించాలి
ABN , First Publish Date - 2021-12-20T05:11:42+05:30 IST
స్వచ్ఛభారత్ కార్మికులకు వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ పశ్చిమ ప్రాంత ఉపాధ్యక్షుడు, స్వచ్ఛభారత్ కార్మికుల యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు శేషయ్య డి మాండ్ చేశారు.
గిద్దలూరు, డిసెంబరు 19 : స్వచ్ఛభారత్ కార్మికులకు వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ పశ్చిమ ప్రాంత ఉపాధ్యక్షుడు, స్వచ్ఛభారత్ కార్మికుల యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు శేషయ్య డి మాండ్ చేశారు. సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జరిగిన స్వచ్ఛభారత్ కార్మికుల సమావేశంలో శేషయ్య మాట్లాడారు. వేతన బకాయిలు చెల్లించి, ఇక నుంచి ప్రతినెలా చెల్లించేలా చర్యలు తీసుకోవా లన్నారు. వైసీపీ వచ్చాక రోజుకో పథకాన్ని ప్రవేశపెడుతున్నదే తప్ప అవసరమైన నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. అలాంటి పథకాలవల్ల పేదలకు, కార్మికులకు ఒరిగేదేమీ ఉండదన్నారు. రోజువారీ పని చేస్తున్న కార్మికులకు నెలవారీ వేతనాలు చెల్లించకపోతే ఎలా బతుకుతారని ప్రశ్నించారు. కరోనా వారియర్స్ పేరుతో ప్రసంశలు కురిపిస్తే కార్మికుల కడుపు నిండదన్నారు. వెంటనే బకాయి పడిన వేతనాలను చె ల్లించి కార్మికులను ఆదుకోవాలన్నారు. అలాగే కరోనాబారిన పడకుండా కార్మికులకు శానిటైజర్‌లు, మాస్కులు, గ్లౌజులు, సబ్బులు, చెప్పులు, యూనిఫామ్ ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమా వేశంలో సీఐటీయూ సహాయ కార్యదర్శి ఆవులయ్య, నాయకులు థామ స్, స్వచ్ఛ కార్మిక సంఘ ప్రతినిధులు నరసయ్య, ప్రసాద్ పాల్గొన్నారు.