మణిపురం గోల్డ్‌లోన్స్‌లో రూ.14 లక్షలు స్వాహా

ABN , First Publish Date - 2021-11-21T05:59:03+05:30 IST

స్థానిక మణిపురం గోల్డ్‌లోన్స్‌లో మేనేజర్‌ గా పనిచేస్తున్న వ్యక్తి సంస్థను మోసగించి రూ.14 లక్షల 42వేలు తారుమా రు చేశారు.

మణిపురం గోల్డ్‌లోన్స్‌లో రూ.14 లక్షలు స్వాహా

సింగరాయకొండ, నవంబరు 20: స్థానిక మణిపురం గోల్డ్‌లోన్స్‌లో మేనేజర్‌ గా పనిచేస్తున్న వ్యక్తి సంస్థను మోసగించి రూ.14 లక్షల 42వేలు తారుమా రు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కావలి చెందిన యెడవల్లి జోసఫ్‌ రాజా గత మూడేళ్ల నుంచి ఇక్కడ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కొంత కాలంగా కార్యాలయంలో తప్పుడు ఖాతాలను సృ ష్టించాడు. ఆఖాతాల్లో తాకట్టు పెట్టిన బంగారం కంటే ఎక్కువ మెత్తాన్ని చూపించి సంస్థను మోసం చేసి దాదాపు రూ.14 లక్షలు స్వాహా చేశారు. మేనేజర్‌ వ్యవహార శైలిపై పైఉద్యోగులకు అనుమానం రావడంతో కార్యా లయంలోని సంస్థ ఖాతా లెక్కలను అడిట్‌ చేయించారు. దీంతో జోసఫ్‌ రాజా చేసిన మోసం బట్టబయలైంది. ఉద్దేశ పూర్వకంగానే సంస్థను మో సం చేసినట్లు సంస్థ పైఅధికారులు నిర్థారణకు వచ్చారు. దీంతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో శనివారం మణిపురం గోల్డ్‌లోన్స్‌లో ఏరియా మేనేజర్‌గా పనిచేస్తున్న నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఎస్సై ఎల్‌. సంప త్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-11-21T05:59:03+05:30 IST