ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సారా ఊట ధ్వంసం

ABN, First Publish Date - 2021-02-14T06:02:02+05:30

నల్లమల అటవీ ప్రాంతంలో రహస్యంగా ఏర్పాటు చేసుకున్న నాటు సారా బట్టీలను గుర్తించి ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ఎస్‌ఈబీ అధికారులు వేగవంతం చేశారు. నామినేషన్ల సందర్భంగా సారా ప్రభావం బాగా కనిపించినట్లు ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. అప్పటికే సారా తయారీపై ఉక్కుపాదం మోపుతున్న ఎస్‌ఈబీ అధికారులు దాడులు పెంచారు.

సారా ఊటను ధ్వంసం ఎస్‌ఈబీ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గిద్దలూరు, ఫిబ్రవరి 13 : నల్లమల అటవీ ప్రాంతంలో రహస్యంగా ఏర్పాటు చేసుకున్న నాటు సారా బట్టీలను గుర్తించి ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ఎస్‌ఈబీ అధికారులు వేగవంతం చేశారు. నామినేషన్ల సందర్భంగా  సారా ప్రభావం బాగా కనిపించినట్లు ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. అప్పటికే  సారా తయారీపై ఉక్కుపాదం మోపుతున్న ఎస్‌ఈబీ అధికారులు దాడులు పెంచారు. బేస్తవారపేట మండలం జేబీక్రిష్టాపురం సమీప కొండ ప్రాంతంలో ఏర్పాటు చేసిన  సారా బట్టీని, డమ్ములను తగులబెట్టారు. గిద్దలూరు మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సారా బట్టీల ఆచూకీ తెలిపి సహకరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఇటీవల 23 కేసులు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేసి, 60 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఈబీ సీఐ సోమయ్య తెలిపారు. 17 సారా బట్టీలను ధ్వంసం చేసి 17,500 లీటర్ల ఊటను పారబోసినట్లు  చెప్పారు. బెల్టుషాపు నిర్వాహకుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.   

Updated Date - 2021-02-14T06:02:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising