టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి

ABN , First Publish Date - 2021-12-19T07:03:28+05:30 IST

ఏపీ అసెంబ్లీ వైసీపీ ప్రభుత్వంలో కౌరవసభగా మారిందని అసెంబ్లీ గౌరవసభగా మారాలంటే టీడీపీ అధికారంలోనికి రావాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మనబోయిన వెంకటేశ్వర్లు తెలిపారు.

టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి
గౌరవసభ కార్యక్రమంలో మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు

సీఎ్‌సపురం, డిసెంబర్‌ 16 : ఏపీ అసెంబ్లీ వైసీపీ ప్రభుత్వంలో కౌరవసభగా మారిందని అసెంబ్లీ గౌరవసభగా మారాలంటే టీడీపీ అధికారంలోనికి రావాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మనబోయిన వెంకటేశ్వర్లు తెలిపారు. వీ.భైలు, చెన్నపునాయునిపల్లి, సీఎ్‌స.పురంలో గ్రామంలో టీడీపీ నాయకులతో కలిసి గౌరవసభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ నాయకుల అరాచకాలు పెరిగిపోయాయన్నారు. వారి అరాచకాలను అడ్డుకోవాలంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ అధికారంలోనికి వచ్చే విధంగా కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లో టీడీపీ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీ.భైలు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జమకాల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడిగా ఊర్లగంటి పెద్దగురవయ్య, ప్రధాన కార్యదర్శిగా దొర తిరుపతయ్య, చెన్నపునాయునిపల్లి పంచాయితీ కమిటీ అధ్యక్షుడిగా దేశనముకుల వెంకటనారాయణ, ఉపాధ్యక్షులుగా చిట్టిబోయిన వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా తోడేటి రఘురాములు, సీఎ్‌సపురం అధ్యక్షుడిగా పోకల రవిచంద్ర, ఉపాధ్యక్షుడిగా ఈర్ల సోమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా బోయిన మాలకొండయ్యలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీఎ్‌సపురం సర్పంచ్‌ శ్రీరాం పద్మావతి, ఉపసర్పంచ్‌ పాములపాటి నర్సయ్య,  తెలుగుయవత అధ్యక్షుడు బత్తుల రమణయ్య, మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలు జె.లక్ష్మీదేవి, మాజీ మండలపార్టీ అధ్యక్షులు షేక్‌.అబ్దుల్లా, మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షులు ఏసురత్నం మాజీ సర్పంచ్‌లు పి.రవికుమార్‌, ఎన్‌.సీ.మాలకొండయ్య, టౌన్‌ అధ్యక్షులు పోకల రవిచంద్ర మండల టీడీపీ నాయకులు అట్లూరి రామకృష్ణరాజు, షేక్‌.రజ్జబ్‌ బాషా, బత్తుల వెంకటాద్రి, బత్తుల శ్రీను, గజ్జల నారాయణ, మాబాషా, బొబ్బూరి శ్రీను, ఎస్‌.డీ.దౌలత్‌, పి.గురుకృష్ణ, సంగిశెట్టి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-19T07:03:28+05:30 IST