ఆత్మహత్యలు వద్దు... ఉపాధి బకాయిలు ఇప్పిస్తాం: లోకేశ్
ABN , First Publish Date - 2021-12-19T08:11:38+05:30 IST
ఆత్మహత్యలు వద్దు... ఉపాధి బకాయిలు ఇప్పిస్తాం: లోకేశ్
విజయవాడ, డిసెంబరు 18: ‘‘మీ బకాయిలన్నీ ఇప్పిస్తాం. వడ్డీతో సహా పెండింగ్ బిల్లుల్లోని మీ ఆఖరి రూపాయి మీకు వచ్చేవరకూ పోరాటం చేస్తాం. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. హైకోర్టు సహకారంతో ఇప్పటికే పెండింగ్ బిల్లులు 1500 కోట్లు వచ్చాయని, ఇంకా పనులు చేసినవారికి రావాల్సిన సుమారు వెయ్యి కోట్లు వచ్చేవరకు న్యాయపోరాటం చేసి వారికి అండగా ఉంటామన్నారు.