రెండో డోసు వ్యాక్సిన్‌ను సద్వినియోగం చేసుకోండి

ABN , First Publish Date - 2021-05-14T02:57:02+05:30 IST

రెండో డోసు కరోనా వ్యాక్సినేషన్‌ ను సద్వినియోగం చేసుకోవాలని డీఎల్‌పీవో కృష్ణమోహన్‌ పేర్కొన్నారు. ముత్తుకూ

రెండో డోసు వ్యాక్సిన్‌ను సద్వినియోగం చేసుకోండి
వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న డీఎల్‌పీవో కృష్ణమోహన్‌

ముత్తుకూరు, మే13:  రెండో డోసు కరోనా వ్యాక్సినేషన్‌ ను సద్వినియోగం చేసుకోవాలని డీఎల్‌పీవో కృష్ణమోహన్‌ పేర్కొన్నారు. ముత్తుకూరు వెలుగు కార్యాయలంలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి డోసు వేసుకున్న వారికి రెండో డోసు అందించేందుకు ఈ నెల 12వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నామన్నారు. తొలి డోసు వేసుకున్న వారు మండలంలో 2వేల మంది ఉన్నారని, వారికి రెండో డోసు వేస్తున్నందున, నిర్ణీత గడువు దాటిన వారు తప్పనిసరిగా వచ్చి వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారితో డీఎల్‌పీవో మాట్లాడి, తాను రెండు డోసులు వేయించుకున్నానని, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. ముత్తుకూరులో డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు సంబంధించి అధికారులతో మాట్లాడి, చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం స్వచ్ఛ సన్నాహాల్లో భాగంగా మండలంలోని గ్రామాల్లో పర్యటించారు. పంచాయతీ కార్యదర్శులతో గ్రామంలో చేపడుతున్న పారిశుధ్య పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.  ముత్తుకూరులో పారిశుఽధ్య పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ హేమంత్‌కుమార్‌, ముత్తుకూరు ఈవో చక్రం వెంకటేశ్వర్లు, కృష్ణపట్నం పంచాయతీ కార్యదర్శులు రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-14T02:57:02+05:30 IST