అంగన్‌వాడీ భవనం స్థలం పరిశీలన

ABN , First Publish Date - 2021-05-22T04:15:53+05:30 IST

స్థానిక వడ్డిపాళెం ప్రాంతంలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని శుక్రవారం తహసీల్దారు గీతావాణి పరిశీలించారు.

అంగన్‌వాడీ భవనం స్థలం పరిశీలన

చిల్లకూరు, మే 21: స్థానిక వడ్డిపాళెం ప్రాంతంలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని శుక్రవారం తహసీల్దారు గీతావాణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  గతంలో ఈ ప్రాంతంలోని 5 సెంట్ల స్థలాన్ని అంగన్‌వాడీ భవనానికి  కేటాయించామన్నారు.  దేశమ్మఅమ్మవారికి పొంగళ్లు పెట్టుకునేందుకు ఇబ్బందిగా ఉందంటూ స్థానికులు ఇందుకు అభ్యంతరం తెలపడంతో, వారితో చర్చించి అంగీకరింపజేశామని తెలిపారు.  బూదనం ఆక్సిజన్‌ ఫ్లాంటు నుంచి జిల్లాలోని వివిధ ఆసుపత్రులకు 166 ఆక్సిజన్‌ సిలిండర్లు అందించామని వివరించారు.

Updated Date - 2021-05-22T04:15:53+05:30 IST