రాజధాని రైతుల మహాపాదయాత్రలో పాల్గొన్న జనసేన నేతలు

ABN , First Publish Date - 2021-11-26T18:14:11+05:30 IST

అమరావతి రైతుల మహాపాదయాత్రకు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సంఘీభావం తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు.

రాజధాని రైతుల మహాపాదయాత్రలో పాల్గొన్న జనసేన నేతలు

నెల్లూరు: ఏపీ సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. న్యాయస్థానం టూ దేవస్థానం పేరిట రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నెల్లూరు జిల్లాలో జరుగుతోంది. కాగా రైతుల పోరాటానికి బాసటగా నిలవాలని జనసేన పార్టీ నిర్ణయించింది. రైతుల ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే మద్దతు తెలిపిన క్రమంలో తాజాగా జనసేన కూడా అమరావతి రైతుల పక్షాన పోరుబాట పట్టాలని నిర్ణయించింది. శుక్రవారం కొనసాగుతున్న రైతుల మహాపాదయాత్రకు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సంఘీభావం తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయనతోపాటు జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-26T18:14:11+05:30 IST